ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ కమిటీలకు ప్రామాణికం లేదు

ABN, First Publish Date - 2021-07-31T09:20:55+05:30

బోగస్‌ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా మూడు రాజధానులు చేస్తున్నామని చెప్పటం సిగ్గుచేటుగా ఉందిన రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పేర్కొన్నారు. హైపవర్‌ కమిటీ, జీఎన్‌రావు కమిటీలంటూ నాటకం ఆడి మూడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

591వ రోజుకు  అమరావతి రైతుల ఆందోళనలు 


తుళ్లూరు, జూలై 30 : బోగస్‌ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా మూడు రాజధానులు చేస్తున్నామని చెప్పటం సిగ్గుచేటుగా ఉందిన రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పేర్కొన్నారు. హైపవర్‌ కమిటీ, జీఎన్‌రావు కమిటీలంటూ నాటకం ఆడి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. అసలు ఆ కమిటీలకు ప్రామాణికం లేదన్నారు.  నిపుణులైన వారు కమిటీలలో లేరన్నారు. అవి ఇచ్చే నివేదకను ఆధారంగా చేసుకొని మూడు రాజధానులు పెడుతున్నామమని, అమరావతి ముంపు ప్రాంతం అని ప్రచారం చేయటం దారుణమన్నారు. ఎంత అణచి వేయాలని చూసినా..  రాజధాని అమరావతి అంతకంత ఎత్తుకు ఎదుగుతుందని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 591వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ  ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే రాజధాని అమరావతి ఏర్పడాలన్నారు.  కాగా, రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని పెదపరిమి, తుళ్లూరు, ఐనవోలు, మందడం, వెలగపూడి, దొండపాడు, నెక ్కల్లు, అనంతవరం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి  తదితర రాజధాని గ్రామాలలోని రైతు శిబిరాలలో   ఆందోళనలు కొనసాగుతున్నాయి.  అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.

Updated Date - 2021-07-31T09:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising