ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి తెరపైకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అంశం

ABN, First Publish Date - 2021-12-27T20:52:07+05:30

మరోసారి తెరపైకి కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అంశం వచ్చింది. కమ్యూనిస్టుల ఐక్యతపై సీపీఎం మహా సభల్లో ఆసక్తికర చర్చ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మరోసారి తెరపైకి కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అంశం వచ్చింది. కమ్యూనిస్టుల ఐక్యతపై సీపీఎం మహా సభల్లో ఆసక్తికర చర్చ జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు కలిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. 16 ఏళ్ల క్రితం సీపీఎం నేత బీవీ రాఘవులు చేసిన లెఫ్ట్ పార్టీల విలీన ప్రతిపాదనకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని రామకృష్ణ విమర్శించారు. రాజకీయం కోసమో.. ఓట్లు-సీట్లు కోసమో లెఫ్ట్ పార్టీలు ఐక్యమైతే లాభం లేదని, విధానాలు కలిసినప్పుడే ఐక్యత సాధ్యమవుతుందని  రాఘవులు వ్యాఖ్యానించారు. విధానాలపై చర్చ అయినా జరగాలి కదా అని రామకృష్ణ ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన రాజధాని రైతుల సభలో బీజేపీ పాల్గొంది.. కాబట్టే తాము పాల్గొనలేదని రాఘవులు తెలిపారు. రాజధాని రైతుల సభలో రైతు జాతీయ నేత టికాయత్‌ను ఆహ్వానించినా.. బీజేపీ కోసం ఆహ్వానాన్ని విత్ డ్రా చేసుకున్నారంటూ రాఘవులు అభియోగం పోపారు. బీజేపీ పాల్గొన్నదని తాము రాజధాని సభకు దూరంగా ఉంటే బీజేపీ సంతోషిస్తుంది కదా అంటూ రామకృష్ణ కౌంటర్ వేశారు.

Updated Date - 2021-12-27T20:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising