ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం: పెద్దిరెడ్డి

ABN, First Publish Date - 2021-12-18T01:12:32+05:30

ఎట్టి పరిస్థితిల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఎట్టి పరిస్థితిల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని ప్రకటించారు. అది రైతుల ఉద్యమం కాదని, టీడీపీ దగ్గరుండి అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తోందని విమర్శించారు. నైతిక విలువల్లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని తెలిపారు. తోక పార్టీలను వెంటేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు అబద్ధాలాడుతున్నారని దుయ్యబట్టారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా.. వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీ ఒకే వేదికపైకి వచ్చాయని తప్పుబట్టాయి. సీఎం జగన్‌ను పదవి నుంచి దింపాలనే అనైతికంగా పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. కోర్టు ఒకే రాజధానికి అనుకూలంగా తీర్పు ఇస్తుందని చంద్రబాబు చెబుతున్నారని, కోర్టు తీర్పులను కూడా చంద్రబాబు ముందుగానే చెబుతున్నారంటే.. ఏ స్థాయిలో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో చెప్పక్కర్లేదన్నారు. వైసీపీలో ఎంగిలికూడు తిన్న నేతలు ఇప్పుడు జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో ఎంపీ రఘురామ జతకలిసి దుష్ప్రచారం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2021-12-18T01:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising