ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసీకి సహకరించండి

ABN, First Publish Date - 2021-01-24T08:07:44+05:30

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌కు జగన్‌ ప్రభుత్వం సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ సూచన 


తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 23: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌కు జగన్‌ ప్రభుత్వం   సహకరించాలని   సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూచించారు. తిరుపతిలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పును గౌరవించాల్సింది పోయి కరోనా సాకుతో సుప్రీంకోర్టుకు వెళతామనడం విడ్డూరంగా ఉందన్నారు.ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదన్నారు.ప్రభుత్వ యంత్రాంగం కూడా విజ్ఞతతో వ్యవహరించి ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకోవాలని కోరారు. గత ఏడాది ఆగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలు కావడంలో అధికార పార్టీ హస్తం వుందని తప్పుబట్టారు. వాటిని రద్దు చేసి తాజా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని కోరారు. గతంలో ఆరోపణలను ఎదుర్కొన్న అధికారులను బదిలీ చేసి పారదర్శక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.  

Updated Date - 2021-01-24T08:07:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising