ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీటీపీఎస్‌కు బొగ్గు కొరత

ABN, First Publish Date - 2021-10-13T20:36:53+05:30

విజయవాడ సమీపంలోని వీటీపీఎస్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో బొగ్గు కొరత ఏర్పడుతోంది. దీంతో బొగ్గు గణనీయంగా నిల్వలు తగ్గాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయవాడ సమీపంలోని వీటీపీఎస్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో బొగ్గు కొరత ఏర్పడుతోంది. దీంతో బొగ్గు గణనీయంగా నిల్వలు తగ్గాయి. బొగ్గు సరఫరాను పెంచుకునేందుకు జెన్‌కో ప్రయత్నాలు చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా వీటీపీఎస్‌‌లో యూనిట్లు మూతపడే అవకాశం లేదని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. వీటీపీఎస్‌లోని 7 యూనిట్లకు గాను 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ప్లాంట్ నిర్వహణ పనుల కారణంగా రెండో యూనిట్‌లో ఉత్పత్తి నిలిచిపోయింది. వీటీపీఎస్‌లో 1760 మెగావాట్ల సామర్థ్యానికి గాను 1280 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రోజుకు వీటీపీఎస్‌‌లో 25 వేల టన్నుల బొగ్గు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం 30 వేల టన్నుల బొగ్గు యార్డ్‌లో ఉన్నట్లు జెన్‌కో అధికారులు చెబుతున్నారు. 


రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) కూడా బొగ్గు సంక్షోభం ఎందుర్కొంటోంది. ఆరు యూనిట్ల ద్వారా పూర్తి సామర్థ్యం 1,650 మెగావాట్ల పవర్‌ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 25 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరమని ఇంజనీర్లు అంటున్నారు. తాజాగా ఉన్న నిల్వలు 65 వేల టన్నులే. కోల్‌ మైనింగ్‌ నుంచి రోజూ సరఫరా అవుతున్నది 8-12 వేలు టన్నులకు మించడం లేదు. దీంతో బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే మూడు యూనిట్లు మాత్రమే రన్‌ చేస్తుంటే.. మంగళవారం మరో యూనిట్‌ కూడా షట్‌డౌన్‌ చేసినట్లు తెలిసింది.

Updated Date - 2021-10-13T20:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising