ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనార్టీ శాఖపై సీఎం జగన్ సమీక్ష

ABN, First Publish Date - 2021-08-09T23:25:38+05:30

మైనార్టీ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ భూములపై పూర్తిస్థాయిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మైనార్టీ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వక్ఫ్ భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వక్ఫ్ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని జగన్ సూచించారు. వైఎస్సార్ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్ ఆస్తులను కూడా సర్వే చేయాలన్నారు. కర్నూలులో వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


మైనార్టీలకు కొత్త స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలన్నారు. ఇమామ్‌లు, మౌజంలు, పాస్టర్లకు సకాలంలో వేతనాల చెల్లింపులు జరగాలన్నారు. కర్నూలులో ఉర్దూ వర్సిటీ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. షాదీఖానాల నిర్వహణను మైనార్టీ శాఖకు బదిలీ చేయాలన్నారు. హజ్ కమిటీలు, వక్ఫ్ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తిచేయాలన్నారు. గుంటూరులో అసంపూర్ణంగా నిలిచిపోయిన క్రిస్టియన్ భవన్‌ను పూర్తిచేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. 

Updated Date - 2021-08-09T23:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising