ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీపై సీఎం జగన్‌ నిర్ణయమే ఫైనల్: సూర్యనారాయణ

ABN, First Publish Date - 2021-12-14T03:05:58+05:30

పీఆర్సీపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ కాలయాపన కోసమేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కమిటీ నియామకం, నివేదికలు ఎలా ఉన్నా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీఆర్సీపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ కాలయాపన కోసమేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కమిటీ నియామకం, నివేదికలు ఎలా ఉన్నా సీఎం జగన్‌ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెడితే...కొన్ని సంఘాలు ముందే నిరసనలు మొదలు పెట్టాయని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నిరసనల్లో ఉద్యోగుల మద్దతు కనిపించడం లేదన్నారు. నిరసనల పేరుతో సంఘాల నేతలు ఓ అరగంట ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆ రెండు సంఘాలు రాజకీయ ప్రేరేపిత ఉద్యమాలు చేస్తున్నాయని, ఏదో ఆశించి రెండు నెలల్లో రిటైర్డ్ అవుతున్న NGO నేత బండి శ్రీనివాస్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల దోస్తాం అని ఉద్యోగ సంఘాల నేతలు సవాళ్లు చేస్తున్నారని సూర్యనారాయణ తెలిపారు. 


Updated Date - 2021-12-14T03:05:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising