ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ

ABN, First Publish Date - 2021-09-18T12:15:00+05:30

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అర్చకులు అంకురార్పణ గావించారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అర్చకులు అంకురార్పణ గావించారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్యంగ్రహణం, సేవాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో సదాభార్గవి, ఆలయ డిప్యూటీఈవో కస్తూరిబాయి, ఏవీఎస్వో వెంకటరమణ, ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, సూపరింటెండెంట్‌ శేషగిరి, వీఐ మహేష్‌, రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ఏటా మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం పరిపాటి. ఇందులో భాగంగా శనివారం పవిత్ర ప్రతిష్ఠ, ఆదివారం పవిత్ర సమర్పణ, సోమవారం మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

Updated Date - 2021-09-18T12:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising