ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచుల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌

ABN, First Publish Date - 2021-11-22T05:20:48+05:30

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఖాతాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఒక్కసారిగా పంచాయతీ ఖాతాలో రూ.లక్షల డబ్బులు మాయం కావడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఖాతాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఒక్కసారిగా పంచాయతీ ఖాతాలో రూ.లక్షల డబ్బులు మాయం కావడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల కిందట 15వ ఆర్థిక సంఘం మొదటి క్వార్టర్‌ నిధులు రూ.23.96 కోట్లు, రూ.36 కోట్ల చొప్పున రెండు విడతలుగా మంజూరయ్యాయి. పంచాయతీ స్థాయిని బట్టి ఈ నిధులను కేటాయించారు. పారిశుధ్య పనులు, తాగునీటి పథకాల మరమ్మతులు, కార్మికుల జీతాలు, పంచాయతీ అభివృద్ధికి దాదాపు 60శాతం నిధులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. శనివారం సీఎఫ్‌ఎంఎస్‌కు లింక్‌ అయి ఉన్న సర్పంచుల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ చూపించింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అధికారులూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయమై డీపీవో దశరథరామిరెడ్డిని వివరణ కోరగా.. సోమవారం రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి కారణాలను కనుక్కుంటామన్నారు.

Updated Date - 2021-11-22T05:20:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising