ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలికిరి చెరువు గంగమ్మకు ఎల్లమ్మ సారె

ABN, First Publish Date - 2021-11-22T04:48:48+05:30

భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన కలికిరి పెద్ద చెరువు గంగమ్మకు ఆదివారం పసుపు, కుంకుమలతోపాటు సారె సమర్పించారు.

గంగమ్మకు సారె సమర్పిస్తున్న ఆలయ పెద్దలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, నవంబరు 21: భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చిన కలికిరి పెద్ద చెరువు గంగమ్మకు ఆదివారం పసుపు, కుంకుమలతోపాటు సారె సమర్పించారు. గ్రామ దేవత ఎల్లమ్మ తరపున కుంకుమార్చన నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం గంగమ్మను శాంతింపజేసేందుకు ఎల్లమ్మ ఆలయం నుంచి సంప్రదాయబద్దంగా మేళతాళాలతో ఆలయ పెద్దలు ఊరేగింపుగా పసుపు, కుంకుమలు, సారెను చెరువు వద్దకు తీసుకొచ్చారు. అనంతరం పడమటి మొరవలో గంగమ్మకు సమర్పిం చారు. అదే విధంగా సమీపంలోని చెరువులో కొలవుదీరిన కలికమ్మ, కొలికమ్మ దేవతలకు కూడా పసుపు కుంకుమలను సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకుడు అశోక్‌కుమార్‌ రెడ్డి, కలికిరి సర్పంచ్‌ ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, మధుసూదన రెడ్డి తదితరులు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-22T04:48:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising