ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంగ్‌ కాల్‌ వివాదం తెచ్చిన తంటా

ABN, First Publish Date - 2021-05-14T05:10:52+05:30

రాంగ్‌ కాల్‌ వివాదం ఓ యువకుడిని చిత్రహింసలకు గురిచేసింది. కొందరు యువకులు ఆగ్రహావేశాలతో అతడిపై మూకుమ్మడిగా దాడిచేసి చిత్రహింసలకు గురిచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువకుడిపై దాడి, ఆపై చిత్రహింసలు

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో


మదనపల్లె క్రైం, మే 13: రాంగ్‌ కాల్‌ వివాదం ఓ యువకుడిని చిత్రహింసలకు గురిచేసింది.  కొందరు యువకులు ఆగ్రహావేశాలతో అతడిపై మూకుమ్మడిగా దాడిచేసి చిత్రహింసలకు గురిచేశారు. ఈ సంఘటన గురువారం మదనపల్లెలో ఆలస్యంగా వెలుగుచూసింది. టూటౌన్‌ పోలీసుల కథనం మేరకు..మదనపల్లె పట్టణం రామారావుకాలనీకి చెందిన మహే్‌ష(18)కు ఇటీవల ఓ యువతి మొబైల్‌ నుంచి రాంగ్‌ కాల్‌ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ, యువతి సోదరుడు, అతడి స్నేహితులు కలసి రెండురోజుల కిందట మహే్‌షకు ఫోన్‌చేసి పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు రమ్మన్నారు. రాకుంటే ఇంటికొచ్చి కొడతామని బెదిరించారు. దీంతో అతడు లాడ్జి వద్దకు రాగానే, అక్కడే వున్న రౌడీషీటర్‌ రెడ్డిపవన్‌, మోహన్‌ మరికొందరు కలసి మహే్‌షను ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ మూకుమ్మడిగా దాడిచేసి చిత్రహింసలకు గురిచేశారు. దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండడంతో టూటౌన్‌ పోలీసులు ఆరా తీశారు. దీంతో అసలు నిజం తెలిసింది.  గురువారం  పోలీసులు లాడ్జి వద్దకు చేరుకుని అక్కడి సిబ్బందిని విచారించగా, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.  సీసీఫుటేజీని పరిశీలించి దాడికి పాల్పడ్డ యువకులను గుర్తించారు. అనంతరం మహే్‌షను స్టేషన్‌కు రప్పించి అతడి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. పదిమంది యువకులు తనను చిత్రహింసలకు గురిచేసి దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింహులు తెలిపారు.

Updated Date - 2021-05-14T05:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising