ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భర్త ఇంటి మందు భార్య బైఠాయింపు

ABN, First Publish Date - 2021-03-25T05:11:54+05:30

రెండో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి ముందు మొదటి భార్య నిరసన వ్యక్తంచేసిన ఘటన బుధవారం శీరంగరాజపురం మండలంలో చోటుచేసుంది.

కొత్తపల్లెమిట్టలో భర్త కోసం భార్య పిల్లలు నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీరంగరాజపురం, మార్చి 24 : రెండో పెళ్లి చేసుకున్న భర్త ఇంటి ముందు మొదటి భార్య నిరసన వ్యక్తంచేసిన ఘటన బుధవారం శీరంగరాజపురం మండలంలో చోటుచేసుంది. బాధితురాలి కథనం మేరకు... 49-కొత్తపల్లెమిట్లకు చెందిన ఉదయకుమార్‌తో చిత్తూరు చెందిన సంధ్యకు 2006 వివాహం కాగా వారు గుంటూరులో స్థిరపడ్డారు. తిరిగి 2010లో చిత్తూరుకు వచ్చారు. అప్పటినుంచి కుటుంబంలో చిన్నచిన్న తగాదాలు ఉండేవి. 2014లో భార్య, భర్త విడిపోయి వేర్వేరుగా జీవిస్తున్నారు. విడాకులు కావాలని ఉదయకుమార్‌ కోర్టును ఆశ్రయించాడు. ఏడేళ్లుగా  కోర్టులో కేసు నడుస్తోంది. రెక్కల కష్టంతో పిల్లలను పోషించుకుంటోంది. నెల రోజుల క్రితం మరో మహిళతో రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అందడంతో, ఆమె 49. కొత్తపల్లెమిట్టలో తన భర్త ఇంటికి బుధవారం పిల్లలతో రాగా, అత్త, మామ, భర్త, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. భర్త వచ్చే వరకు ఇల్లు వదిలి కదిలే ప్రసక్తే లేదని, ఇంటి ముందు భార్య సంధ్య, పిల్లలు తిష్ట వేసి తమకు న్యాయం చేయాలను నిరసన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-03-25T05:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising