ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎందుకట?

ABN, First Publish Date - 2021-05-11T09:18:04+05:30

20 రోజుల్లో రిటైరవబోతున్న డీటీకి సీనియర్‌ తహసీల్దార్‌ను బదిలీ చేసి మరీ ఇన్‌చార్జి తహసీల్దార్‌ బాధ్యతలు అప్పగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20 రోజుల్లో రిటైర్‌ కానున్న డీటీకి తహసీల్దార్‌గా ప్రధాన మండలం అప్పగింత


చిత్తూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): ఇంకో ఇరవై రోజుల్లో ఆయన డిప్యూటీ తహసీల్దార్‌గా రిటైర్‌ అవబోతున్నారు. హఠాత్తుగా ఇప్పుడు బదిలీ చేశారు. అదేదో పనిష్మెంట్‌ అనుకుంటే పొరపాటే. కోరుకున్న సీటులో రిటైర్‌ కావా లన్న  ఆయన కోరిక తీర్చడానికే ఇలా చేశారని చెప్పుకుంటున్నారు. అదీ, అక్కడ ఉన్న సీనియర్‌ అయిన తహసీల్దార్‌ను బదిలీ చేసి, డిప్యూటీ తహ సీల్దార్‌ అయిన ఈయనకు బాధ్యతలు అప్పగించారు.  పైగా ఆయన కోసం బదిలీ చేసిన అధికారికి ఎక్కడా పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు.20 రోజు లు ఓపికపట్టు నిన్న మళ్లీ అక్కడే ఆ సీటులోనే కూర్చోబెడుతామని హామీ కూడా ఇచ్చారంటున్నారు. జిల్లాలో  ఒక ప్రధాన కేంద్రంలో తహసీ ల్దార్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో పలుకుబడి ఉన్నవాడు. అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఇంకేం ఆయన కోరిక తీర్చడానికి నాయకులు సహకరించారు, అధికారులు తలలూపారు. సోమవారం నాడు ఒక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం స్థాయిలో ఆయన బాధ్యతల స్వీకరణకూడా జరిగింది. ఔరా.. మనవాడైతే చాలు ఎంతకైనా తెగిస్తారు కదా అని  రెవెన్యూ వర్గాల్లో చర్చ సాగు తోంది. అంత పట్టు బట్టి వచ్చిన ఆయన ఈ ఇరవై రోజుల్లో తహసీల్దార్‌గా  ఏమేం చేస్తారో అనే ఆందోళన కూడా ఆ వర్గాల్లో ఉంది.

Updated Date - 2021-05-11T09:18:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising