ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుయాలో ఏందయా.. ఈ దుస్థితి?!

ABN, First Publish Date - 2021-10-25T07:42:21+05:30

రుయాస్పత్రికొచ్చే రోగుల సహాయకులకు ఇప్పట్లో కష్టాలు తప్పేలే కనిపించడం లేదు.

స్ర్టెచర్‌కు ఓ పక్క భార్య, మరోపక్క కుమారుడు... తల్లి చేతిలో పాప, తండ్రి చేతిలో ప్రాణ వాయువు సిలిండర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోగుల సహాయకులకు తప్పని తిప్పలు


తిరుపతి సిటీ, అక్టోబరు 24: రుయాస్పత్రికొచ్చే రోగుల సహాయకులకు ఇప్పట్లో కష్టాలు తప్పేలే కనిపించడం లేదు. ఓపీ ఓ చోట, అత్యవసర విభాగం మరోచోట, వైద్యం ఇంకో చోట.. వైద్యపరీక్షలు వేరేచోట.. ఇలా ఒక్కో విభాగానికి సుమారు 500 మీటరు పొడవు ఉండటంతో రోగులు, వారి సహాయకులు ఆస్పత్రిలో నిత్యం అటూ, ఇటూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ క్రమంలో రోగులను వీల్‌చైర్‌, స్ర్టెచర్‌పై తీసుకెళ్లడానికి గతంలో ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వోలు సాయంగా ఉండేవారు. ప్రస్తుతం వారి ఏజెన్సీ గడువు ముగిసిందని, అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించారు. ప్రత్యామ్నాయంగా ఎవరినీ నియమించకపోవడంతో రోగుల సహాయకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు రోగులైతే తల్లిదండ్రులు, తల్లిదండ్రులు రోగులైతే పిల్లలు.. ఇలా తమ వారిని వీల్‌చైర్‌, స్ర్టెచర్‌పై అటూ, ఇటూ తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో వృద్ధులు కూడా ఉండటంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. అధికారులు కళ్లముందే ఇవి జరుగుతున్నా.. పట్టించుకునేవారే కరువయ్యారు. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



Updated Date - 2021-10-25T07:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising