ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్యాయం కదా!

ABN, First Publish Date - 2021-08-08T06:45:26+05:30

అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమ కాలుష్యానికి కారణమవుతోందంటూ ఆ ప్రాంత ప్రజల నుంచీ గడిచిన మూడున్నర దశాబ్దాలలో ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు కూడా ప్రభుత్వానికి అందింది లేదు. అయినా ప్రభుత్వం పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. చివరికి న్యాయస్థానం ద్వారా ఆ పరిశ్రమ తిరిగి తెరుచుకుంది. అయినా కత్తి వేలాడుతూనే ఉంది.

అమరరాజా సమీపంలోని తారకరామా నగర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరరాజాపై అలా...


అమరరాజా బ్యాటరీస్‌ పరిశ్రమ కాలుష్యానికి కారణమవుతోందంటూ ఆ ప్రాంత ప్రజల నుంచీ గడిచిన మూడున్నర దశాబ్దాలలో ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు కూడా ప్రభుత్వానికి అందింది లేదు. అయినా ప్రభుత్వం పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. చివరికి న్యాయస్థానం ద్వారా ఆ పరిశ్రమ తిరిగి తెరుచుకుంది. అయినా కత్తి వేలాడుతూనే ఉంది. ఆ పరిశ్రమకు పొరుగునే ఉన్న  గాజులమండ్యం పారిశ్రామిక వాడలో విషకాలుష్యంతో ఊళ్లకు ఊళ్లు అల్లాడుతున్నా, దశాబ్దాలుగా పోరాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం అమరరాజా మీద మాత్రం కక్షగట్టడం ప్రజలను  బాధ పెడుతోంది.   ఒకే జిల్లాలో ఇరుగుపొరుగు మండలాల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అమరరాజా పరిశ్రమపై ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణికి అద్దం పడుతున్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. అమరరాజ పరిసర ప్రాంతాల్లోని ప్రజల మాటలు ఇవి...


మా పొట్ట కొట్టద్దు 


అమరరాజాలో 31 ఏళ్లుగా పనిచేస్తున్నాను. చిన్న ఉద్యోగులమైనా మమ్మల్ని అమెరికాకు కూడా పంపించారు. అమరరాజాను ఒక దేవాలయంలాగా భావిస్తాం. ఇక్కడ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తారు. రాజకీయంగా ఏదైనా ఉంటే రాజకీయంగానే చూసుకోవాలి గానీ, మా పొట్టకొట్టడం ఏంటి?  

- చంద్రమోహన్‌, ఉద్యోగి, కరకంబాడి


36 ఏళ్లుగా ఏ సమస్యా లేదు


 ఫ్యాక్టరీ పక్కనే నాకు పది ఎకరాల పొలం ఉంది. కాలుష్యం వలన ఏదైనా ఇబ్బంది ఉంటే మా పైరు పాడైపోవాలి కదా. దాని పక్కన ఉండే చెరువులో పెరిగే చేపలు అందరం తింటున్నాం. ఇప్పటి దాకా మాకు ఎలాంటి ఇబ్బందీ రాలేదు.  ఈమధ్యనే ఫ్యాక్టరీ పక్కనే  తాగునీటి బోరు వేశాం. ఈ ఆనీళ్లే తాగుతున్నాం. 36 ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నాం. ఎప్పుడూ లేని కాలుష్యం ఇప్పుడే వచ్చిందా? 

-బాలసుబ్రమణ్యం, రైతు, కరకంబాడి




కరోనా కూడా అమరరాజ వల్లే వచ్చిందంటారేమో! 


కరకంబాడిలోనే పుట్టి, పెరిగాం.  కంపెనీ రాకముందు  అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్ముకుని బతకతావున్నాం.  ఫ్యాక్టరీ పెట్టినాక స్థిమితంగా బతకతావున్నాం. ఫ్యాక్టరీ పోతే మళ్లీ కట్టెలు కొట్టి బతకాల్సిందే. ఎప్పుడులేని కాలుష్యం ఇప్పుడు వచ్చేసిందా? కరోనా కూడా అమరరాజా వలన వచ్చిందని ప్రభుత్వం చెబుతుందేమో!

- సావిత్రమ్మ, గృహిణి, కరకంబాడి 


జబ్బులు వస్తున్నాయని చెప్పామా? 


అమరరాజా కంపెనీ వలన జబ్జులు వస్తున్నాయని మేమేమన్నా చెప్పామా? మమ్మల్సి వచ్చి విచారిస్తే కదా తెలిసేది. జబ్జులు ఎవరికొచ్చాయో చూపించాల కదా? బలవంతంగా ఎవరిచేతనో చెప్పించుకుని అన్నం పెట్టే కంపెనీ మూసేయిస్తారా? 

-మునిచంద్రమ్మ, గృహిణి, కరకంబాడి 


Updated Date - 2021-08-08T06:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising