ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ వలంటీర్‌ మాకొద్దు

ABN, First Publish Date - 2021-06-20T05:39:46+05:30

‘ఏకపక్ష ధోరణితో అర్హులను వైఎస్సార్‌ చేయూత పథకానికి అనర్హులుగా, అనర్హులను అర్హులుగా ప్రకటించిన ఈ వలంటీర్‌ మాకొద్దు’ అంటూ దూరేవాండ్లపల్లె గ్రామస్తులు శని వారం నిరసన వ్యక్తం చేశారు.

వలంటీర్‌ దిష్టి బొమ్మతో నిరసన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేవీపల్లె, జూన్‌ 19: ‘ఏకపక్ష ధోరణితో అర్హులను వైఎస్సార్‌ చేయూత పథకానికి అనర్హులుగా, అనర్హులను అర్హులుగా ప్రకటించిన ఈ వలంటీర్‌ మాకొద్దు’ అంటూ దూరేవాండ్లపల్లె గ్రామస్తులు శని వారం నిరసన వ్యక్తం చేశారు. బాధితుల కథనం మేరకు.. మండలంలోని మఠంపల్లె గ్రామ పంచా యతీ దూరేవాండ్లపల్లె వలంటీర్‌ గోవర్దన్‌నాయుడుకు గ్రామానికి చెందిన కొందరితో వ్యక్తిగత కక్షలున్నాయి. దీంతో అర్హులైన పేదలను వైఎస్సార్‌ చేయూత పథకానికి అనర్హులుగా చూపాడు. దీని పై ప్రశ్నిస్తే దూషణకు దిగాడు. ఆగ్రహించిన మహిళలు మఠంపల్లి టీడీపీ యువనాయకులు దూరా మదన మోహన్‌నాయుడు, కావలి వెంకట్రమణనాయుడులతో కలిసి వలంటీర్‌ దిష్టిబొమ్మను గ్రామంలో ఊరేగింపుగా తీతవగుంటపల్లె సచివాలయం వరకు తీసుకెళ్లారు. అక్కడ నిరసనకు దిగారు. టీడీపీ వర్గీయులంటూ అనర్హులుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వలంటీర్‌ను తొలగించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం వలంటీర్‌ దిష్టిబొమ్మ దహనానికి య త్నించారు. సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచనతో దహనం చేయడాన్ని నిలిపేశారు. 



Updated Date - 2021-06-20T05:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising