ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాదాత తీర్థం క్రిష్ణయ్యశెట్టి మృతి

ABN, First Publish Date - 2021-05-17T05:37:48+05:30

పలమనేరు పట్టణంలోని తీర్థం క్రిష్ణయ్యశెట్టి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల దాత తీర్థం క్రిష్ణయ్యశెట్టి (90) ఆదివారం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

తీర్థం క్రిష్ణయ్యశెట్టి (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పలువురి సంతాపం 

పలమనేరు, మే16 : పలమనేరు పట్టణంలోని తీర్థం క్రిష్ణయ్యశెట్టి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల దాత తీర్థం క్రిష్ణయ్యశెట్టి (90) ఆదివారం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌కళాశాలకు ఆయన రెండు దశాబ్దాల క్రితమే రూ. 10లక్షలు కార్పస్‌ ఫండ్‌ చెల్లించడంతో పాటు కళాశాలకు పలు సొంత భవనాలు నిర్మించారు. అంతేకాకుండా లైబ్రరీ, ప్రయోగశాల, కంప్యూటర్‌ విద్యకోసం కావలసిన సామగ్రి సమకూర్చారు. విద్యార్థులకోసం డెస్కులు ఏర్పాటుచేశారు. కళాశాల అభివృద్ధికి ఆయన రూ.70 లక్షలపైగా వెచ్చించారు. బైరెడ్డిపల్లె మండలం తీర్థం ఆయన స్వగ్రామం. తీర్థం క్రిష్ణయ్యశెట్టి వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయనకు నలుగురు సంతానం. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తీర్థం క్రిష్ణయ్యశెట్టి పలుధార్మిక కార్యక్రమాలకు బూరివిరాళాలు ఇవ్వడంతోపాటు పలమనేరులోని ఆర్యవైశ్యులతో సన్నిహితంగా వుండేవారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-17T05:37:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising