ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహన్‌ రక్ష యాప్‌, పరికరం ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-05-11T09:39:07+05:30

వాహనాల చోరీలను అరికట్టడానికి తిరుపతి అయాన్‌ టెక్నాలజీస్‌ సంస్థ తయారు చేసిన వాహన్‌ రక్ష పరికరం, యాప్‌ను అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు, ఏఎస్పీ సుప్రజ ఆవిష్కరించారు.

పరికరం పనితీరును పరిశీలిస్తున్న ఎస్పీ, ఏఎస్పీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘తిరుపతి అయాన్‌ టెక్నాలజీస్‌’కు ఎస్పీ అభినందన


తిరుపతి(నేరవిభాగం), మే 10: వాహనాల చోరీలను అరికట్టడానికి తిరుపతి అయాన్‌ టెక్నాలజీస్‌ సంస్థ తయారు చేసిన వాహన్‌ రక్ష పరికరం, యాప్‌ను అర్బన్‌ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు, ఏఎస్పీ సుప్రజ ఆవిష్కరించారు. ఈ పరికరం, యాప్‌ పనితీరును సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరిశీలించారు. సంస్థ ప్రతినిధులు ద్విచక్రవాహనానికి ఈ పరికరాన్ని అమర్చి పనితీరును తెలియజేశారు. వాహనాన్ని ఎవరైనా చోరీ చేసేందుకు ప్రయత్నిస్తే గట్టిగా సైరన్‌ మోగడంతోపాటు స్టార్ట్‌ కాకుండా చేస్తుందని వివరించారు. అంతేకాకుండా యాప్‌ ద్వారా లోకల్‌ పోలీసు స్టేషన్‌కు సమాచారం వెళ్తుందని వెల్లడించారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వాహన్‌రక్ష యాప్‌, పరికరం ద్వారా వాహనాల చోరీలు అరికట్టవచ్చని తయారీ సంస్థ ప్రతినిధులను అభినందించారు. దొంగతనాలను, దోపిడీలను అరికట్టేందుకు అధునాతన టెక్నాలజీని రూపొందించేవారిని పోలీసు శాఖ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ నాగసుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-11T09:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising