ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుత మృతి కేసులో ఇద్దరి అరెస్టు

ABN, First Publish Date - 2021-10-20T06:22:07+05:30

చిరుత పులి మృతి కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.

నిందితుల వివరాలు తెలియజేస్తున్న డీఎఫ్‌వో రవిశంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 19: చిరుత పులి మృతి కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. అటవీ పశ్చిమ విభాగం డీఎఫ్‌వో రవిశంకర్‌ తన కార్యాలయంలో మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. తవణంపల్లె మండలం మడవనేరిలోని చినపాపమ్మ పొలంలో అదే గ్రామానికి చెందిన బాలాజీ (55), మాధవన్‌ (46) అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కుకుని మృతి చెందింది. నిందితులను సోమవారం ఉదయం 7.30 గంటలకు గ్రామంలోని మూలస్థానం ఎల్లమ్మగుడి వద్ద అదుపులోకి తీసుకున్నారు. సమగ్రంగా విచారించాక మంగళవారం వీరిపై అటవీ శాఖ చట్టం కింద కేసు నమోదు చేశారు. అడవి జంతువులను వేటాడే వారికి 3-7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని డీఎఫ్‌వో తెలిపారు. కాగా తవణంపల్లె మండల వైశువైద్యాధికారి  పల్లవి ఆధ్వర్యంలో చిరుత మృతి చెందిన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించామన్నారు. చిరుత వయసు ఐదేళ్లు కాగా.. 24 దంతాలు ఉన్నాయని చెప్పారు. మృతి చెందకముందు అడవి పందిని వేటాడినట్లు రిపోర్టు ద్వారా తెలిసిందన్నారు. సమావేశంలో ఎఫ్‌ఆర్వో సుభాష్‌, డీఆర్వో శివరాం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T06:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising