ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధేయతకు పట్టం

ABN, First Publish Date - 2021-09-17T07:34:28+05:30

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, పులిచెర్ల మాజీ జడ్పీటీసీ పోకల అశోక్‌ కుమార్‌కు టీటీడీ పాలకమండలిలో చోటు దక్కడంపై ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు.

అశోక్‌కుమార్‌ను సన్మానిస్తున్న జిల్లా సహకార ప్రింటింగ్‌ ప్రెస్‌ చైర్మన్‌ మురళీమోహన్‌రెడ్డి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాధ్యతతో పనిచేస్తానన్న పోకల అశోక్‌కుమార్‌


తిరుపతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, పులిచెర్ల మాజీ జడ్పీటీసీ పోకల అశోక్‌ కుమార్‌కు టీటీడీ పాలకమండలిలో చోటు దక్కడంపై ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విధేయుడిగా ఉన్న పోకల వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏర్పాటైన తొలి టీటీడీ పాలకమండలిలోనే అవకాశం వస్తుందన్న ప్రచారం జరిగింది. చివరినిమిషంలో చేజారడంతో రెండోసారి ఎంపికచేసిన కమిటీలో తొలిప్రాధాన్యతగా ఆయనకు అవకాశం లభించింది. బలిజ సామాజికవర్గానికి చెందిన ఈయన 1987లో అయ్యవాండ్లపల్లి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంతో ఉత్తమ సర్పంచిగా అవార్డు అందుకున్నారు. 1995లో ఎంపీటీసీగా, 2006లో పులిచెర్ల జడ్పీటీసీగా గెలుపొందారు. 2013లో వైసీపీలో చేరాక రాష్ట్రస్థాయి పదవులను చేపట్టారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన తనకు టీటీడీలో అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్‌ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి రుణపడి ఉంటానని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానన్నారు. 

Updated Date - 2021-09-17T07:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising