ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి భక్తులకు మరో ప్రసాదం.. ధనం పంపిణీ!

ABN, First Publish Date - 2021-09-01T20:27:24+05:30

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో ప్రసాదాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను శ్రీవారి ‘ధనప్రసాదం’ పేరిట భక్తులకే తిరిగి పంపిణే చేసే కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో ప్రసాదాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించే చిల్లర నాణేలను శ్రీవారి ‘ధనప్రసాదం’ పేరిట భక్తులకే తిరిగి పంపిణే చేసే కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. స్వామివారికి నిత్యం లభించే హుండీ ఆదాయంలో 10 నుంచి 20 లక్షల రూపాయల వరకు భక్తులు చిల్లర నాణేలు రూపంలో కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా లభించే చిల్లర నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో టీటీడీ వద్ద చిల్లర నాణేల నిల్వలు పెరిగి పోయాయి. దీంతో చిల్లర నాణేలను నోట్ల రూపంలో మార్చుకునేందుకు టీటీడీ ఈ ధనప్రసాదాన్ని ప్రారంభించింది. తిరుమలలో సామాన్యులు బస చేసే అతిథి గృహాల రిసెప్షన్ కేంద్రాల్లో చిల్లర నాణేలను 100 రూపాయల ప్యాకెట్ల రూపంలో ప్రత్యేక కవర్లలో భక్తులకు అందిస్తోంది. భక్తులు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా క్యాష్ ఆన్ డిపాజిట్ కూడా చెల్లిస్తుండడంతో.. వారు గదిని ఖాళీ చేసే సమయంలో క్యాష్ ఆన్ డిపాజిట్‌ను శ్రీవారి ధనప్రసాదం రూపంలో చెల్లించే విధంగా బుధవారం నుంచి ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రూపాయి నాణేలను ఇస్తుండగా... రానున్న రోజుల్లో 2,5 రూపాయల నాణేల ప్యాకెట్‌లను కూడా భక్తులకు టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. ఒక వేళ భక్తులు చిల్లర నాణేలను తీసుకునేందుకు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో క్యాష్ ఆన్ డిపాజిట్‌ను భక్తులకు చెల్లించనున్నారు.

Updated Date - 2021-09-01T20:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising