రెడ్డెమ్మ కొండలో టోల్ దోపిడీ..?
ABN, First Publish Date - 2021-08-30T05:17:10+05:30
రెడ్డెమ్మ కొండ ఆలయ మార్గం వెళ్లే వాహనదారులకు టోల్ గేట్ సమస్య పట్టిపీడిస్తోంది.
గుర్రంకొండ, ఆగస్టు 29: రెడ్డెమ్మ కొండ ఆలయ మార్గం వెళ్లే వాహనదారులకు టోల్ గేట్ సమస్య పట్టిపీడిస్తోంది. అమ్మవారి ఆలయానికి వచ్చే వాహనాల రాకపోకలకు గాను వేలం పాటలను ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఈ వేలం పాటలను దక్కించుకొన్నవారు చెర్లోపల్లె మార్గంలోని అమ్మవారి ముఖ ద్వారం వద్ద టోల్ గేట్ వసూలు చేయాల్సి ఉంది. అయితే నిర్వాహకుడు అందుకు బిన్నంగా కడప -బెంగళూరు జాతీయ రోడ్డుపై వసూలు చేస్తున్నాడు. దీంతో చెర్లోపల్లె మార్గంలోని వివిధ గ్రామాలకు వెళ్లే వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అధికారులు స్పందించి టోల్ దీపిడీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
టోల్ గేట్ పేరిట అధిక రేట్లు..!
ఆలయానికి అమ్మవారి దర్శించుకోవడానికి వస్తున్న వాహన దారుల నుంచి నిర్వాహకుడు టోల్ గేట్‌ను అధికంగా వసూలు చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ శాఖ నిబం ధనల ప్రకారం ఆటోకురూ.20, కారుకు రూ.30, లారీకి రూ.50 వసూలు చేయాలి. అందుకు భిన్నంగా నిర్వాహకుడు ఆటోకు రూ.30, కారుకు రూ.50, లారీకి రూ.100 వసూలు చేస్తున్నట్లు భక్తులు వాపో తున్నారు. ఈ విషయమై ఆలయ ఈవో సీతారామిరెడ్డిని వివరణ కోరగా టోల్ గేట్ నిర్వహణ, వసూ లులో నిబంధనలు పాటించేలా చూస్తామన్నారు.
Updated Date - 2021-08-30T05:17:10+05:30 IST