ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టు పురుగులను ఇలా కాపాడుకోండి

ABN, First Publish Date - 2021-11-28T07:13:38+05:30

వర్షాల వల్ల పట్టు పురుగులకు నష్టం కలగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పట్టు పరిశ్రమశాఖ జేడీ శోభారాణి అన్నారు.

పట్టు పరుగుల కేంద్రాన్ని పరిశీలిస్తున్న జేడీ శోభారాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు(సెంట్రల్‌), నవంబరు 27: వర్షాల వల్ల పట్టు పురుగులకు నష్టం కలగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పట్టు పరిశ్రమశాఖ జేడీ శోభారాణి అన్నారు. శనివారం ఆమె తన ఛాంబర్‌లో మాట్లాడుతూ జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, పలమనేరు, కుప్పం, మదనపల్లె ప్రాంతాల్లో 47 వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతుండగా 17 సీఆర్‌సీ సెంటర్లలో పట్టు గుడ్లు, పురుగులను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో ఎక్కడా మల్బరీ పంట దెబ్బతినలేదని, అయితే పట్టు పురుగులకు వాతావరణ పరిస్థితి అనుకూలించకపోతే నష్టపోయే వీలుందన్నారు. దీన్ని అధిగమించడానికి బొగ్గు కుంపట్లు ఏర్పాటు చేసి గది ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. పట్టు పురుగులకు బూజుకట్టు, సున్నం కట్టు వంటి రోగాలు రాకుండా ఉండేందుకు తగిన మోతాదులో మందులు వినియోగించడంతో పాటు వాతావరణం పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని జేడీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-28T07:13:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising