ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకాంతంగా పట్టాభిరాముడి కల్యాణం

ABN, First Publish Date - 2021-04-22T06:39:28+05:30

వాల్మీకిపురం శ్రీపట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముల కల్యాణం జరిగింది.

సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాల్మీకిపురం, ఏప్రిల్‌ 21: వాల్మీకిపురం శ్రీపట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముల కల్యాణం జరిగింది. దాదాపుగా 46 సంవత్సరాల తర్వాత శ్రీరామనవమి రోజున పట్టాభిరామాలయంలో కల్యాణోత్సవం జరగడం విశేషం. సీతమ్మ అశ్లేష జన్మ నక్షత్రం రోజున ఈ వేడుకలను నిర్వహించారు. భోగోత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించి, విశేష అలంకరణలతో ఊంజల్‌ సేవ ఏకాంతంగా సాగింది. టీటీడీ, స్థానిక పంచాయతీ అఽధికారులు ఉత్సవర్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం ఆలయంలో వధూవరులైన సీతారాములకు విశేష అలంకరణ చేసి కల్యాణ వేదికపై ఆశీనులు చేశారు. మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పరిమిత సంఖ్యలో భక్తుల హాజరుతో కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై సీతాలక్ష్మణ సమేతుడైన  పట్టాభిరాముడిని  అధిష్ఠింపచేసి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఆలయ ఈవో మోహన్‌రావు, ఆగమ పండితులు మణికంఠభట్టార్‌, అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, కృష్ణప్రసాద్‌ భట్టార్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-22T06:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising