ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడిలో వైద్యులది అలుపెరగని కృషి

ABN, First Publish Date - 2021-01-25T07:09:02+05:30

కరోనా కాలంలో వైద్యులు, వైద్య విద్యార్థులు అలుపెరగని కృషి చేశారని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రశంసించారు.

విద్యార్థినికి ప్రశంసా పత్రం అందజేస్తున్న తమిళిస
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వీడండి

తెలంగాణ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై


తిరుపతి (వైద్యం)/తిరుచానూరు, జనవరి 24: కరోనా కాలంలో వైద్యులు, వైద్య విద్యార్థులు అలుపెరగని కృషి చేశారని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ప్రశంసించారు. ఆదివారం తిరుపతిలోని ఎస్వీ మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థులు నిర్వహించిన గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. పూర్వవిద్యార్థుల అసోసియేషన్‌ చేస్తున్న సేవలు, వైద్య విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్న సెమినార్స్‌ రాబోయే రోజుల్లో అందరికీ ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజలను భయాందోళనకు గురిచేసిన కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు మన శాస్త్రవేత్తలు పడిన కష్టానికి నిదర్శనమే ఈరోజు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడమన్నారు. అనంతరం కార్డియాలజీ విభాగంపై నిర్వహించిన సెమినార్‌లో అధ్యాపకులు, వైద్య విద్యార్థులకు గవర్నర్‌ ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, ప్రొఫెసర్లు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక ఆమె మీడియాతో మాట్లాడారు. 


Updated Date - 2021-01-25T07:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising