ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రిశంకు స్వర్గంలో కొవాగ్జిన్‌ రెండో డోసు

ABN, First Publish Date - 2021-05-06T05:43:37+05:30

కొవాగ్జిన్‌ రెండో డోసు వేసుకోవలసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలికిరి, మే 5: కొవాగ్జిన్‌ రెండో డోసు వేసుకోవలసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బుధవారం జిల్లా 40 వేల డోసులు కొవీషీల్డ్‌ టీకా మాత్రం సరఫరా అయ్యింది. వీటిని రెండో డోసు వేసుకోవలసి వారికి మాత్రమ వేయనున్నట్లు వైద్య శాఖాధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం సరఫరా అయిన కొవిషీల్డ్‌ కూడా రెండో డోసు వేసుకోవలసిన వారికి సరిపడా లేదు. దీంతో మొదటి డోసు కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి ఏమిటన్న దానిపై ఎవరూ స్పష్టత ఇవ్వలేకున్నారు. ఇక రెండో డోసు కొవాగ్జిన్‌ వేసుకోవలసిన వారికి ఇప్పట్లో అవకాశం వచ్చేటట్లు లేదని కూడా అంటున్నారు. ఇప్పటికే కొవాగ్జిన్‌ రెండో డోసు వేసుకోవలసిన గడువు దాటి పోయిందని ఆరు వారాలు దాటినా ఇంకా రెండో డోసు వేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా గడువు దాటి పోయిన వారు తిరిగీ కొవాగ్జిన్‌ మొదటి డోసు నుంచి మొదలు పెట్టాల్సిందేనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం కొవాగ్జిన్‌ సరఫరా ఎప్పుడు జరుగుతుందనే విషయంలో కూడా ఎవరూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఉన్నతాధికారులు కూడా దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2021-05-06T05:43:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising