ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటేదైనా ధర పాతాళంలోనే!

ABN, First Publish Date - 2021-06-09T06:00:34+05:30

మరోసారి రైతన్న మార్కెట్‌ ధరల మాయాజాలంలో మునిగిపోయాడు.పంటేదైనా ధర లేకపోవడంతో ఒక్క రామసముద్రం మండలంలోనే టమోటా, వంగ, మిరప, కాలీఫ్లవర్‌, బంగాళాదుంప, క్యాబేజి, బంతిపూలు తదితర పంటలను 6 వేల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఏ పంటకు ధర లేకపోవడంతో నష్టాలను చవిచూస్తున్నారు.

మూడు ఎకరాల్లో టమోటా సాగు చేసి నాలుగు లక్షలు నష్టపోయానంటున్న రామాంజులు నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరోసారి రైతన్న మార్కెట్‌ ధరల మాయాజాలంలో మునిగిపోయాడు.పంటేదైనా ధర లేకపోవడంతో ఒక్క రామసముద్రం మండలంలోనే  టమోటా, వంగ, మిరప, కాలీఫ్లవర్‌, బంగాళాదుంప, క్యాబేజి, బంతిపూలు తదితర పంటలను 6 వేల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఏ పంటకు ధర లేకపోవడంతో నష్టాలను చవిచూస్తున్నారు. సాగు ఖర్చు రూ.వంద కోట్లు నేలపాలవడంతో మరోపంటకు అప్పుల వేటలో మునిగిపోయారు.ఎకరా టమోటా సాగుకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి 35 నుంచి 40 టన్నులు దిగుబడి సాధిస్తున్నారు. మదనపల్లె టమోటా మార్కెట్‌లో 30 కిలోల టమోటా క్రేట్‌ రూ.30 నుంచి 100 లోపు పలుకుతుండడంతో ఆరంభంలోనే రైతులు హడలిపోయారు. అయిన ధరలు రాకపోతాయా అనే ఆశతో పంటలను కాపాడుకున్నా పరిస్థితి మారకపోవడంతో రైతులు నిర్వేదంలో మునిగిపోయారు.కొంతమంది పంటను  పొలాల్లోనే వదిలేయగా, మరికొందరు రైతులు కోతలు కోసి మార్కెట్‌కు తరలించి వచ్చిన అరకొర డబ్బును కూలీలకు, బాడుగలకు ఇచ్చేస్తున్నారు. 5 వేల ఎకరాల్లో టమోటా సాగు చేయగా సగం మంది కోతలు కోయకుండానే పొలాల్లోనే పంటను వదిలేశారంటే ధరల పరిస్థితి అర్థమవుతుంది. అలాగే కాలీఫ్లవర్‌, క్యాబేజి, వంగ, బంతిపూలు, మిరప తదితర పంటలను కోతలు కోయకుండా వదిలేశారు. 700 ఎకరాల్లో సాగు చేసిన బంతిపూలు కనీసం కిలో రూ.10కూడా పలక్కపోవడంతో పొలాల్లోనే మగ్గిపోతున్నాయి. 300 ఎకరాల్లో సాగు చేసిన రోజా పూలది కూడా అదే పరిస్థితి.  

-రామసముద్రం 



Updated Date - 2021-06-09T06:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising