ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దేరుకు ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి

ABN, First Publish Date - 2021-08-30T05:33:53+05:30

తంబళ్లపల్లె మండలంలోని కొటాల పంచాయతీ జుంజురపెంట వద్ద నిర్మించిన పెద్దేరు ప్రాజెక్టు సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో ఈ ఏడాదిలో రెండోసారి పెద్దేరు నిండి పొంగి పోర్లుతోంది.

పెద్దేరు ప్రాజెక్టును తిలకిస్తున్న పర్యాటకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తంబళ్లపల్లె, ఆగస్టు 29: మండలంలోని కొటాల పంచాయతీ జుంజురపెంట వద్ద నిర్మించిన పెద్దేరు ప్రాజెక్టు సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరడంతో ఈ ఏడాదిలో రెండోసారి పెద్దేరు నిండి పొంగి పోర్లుతోంది. ప్రాజెక్టుకు వచ్చే సందర్శుకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు రూ.50 లక్షలతో ఆరు ఎకరాలల్లో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో జలాశయాన్ని తిలకించేందుకు కుటుంబ సమేతంగా సందర్శకులు తరలివచ్చి సాయంత్రం వరకూ పార్కులో సేద తీరారు. దీంతో ప్రాజెక్టు పరిసరాలు పిల్లలు, పెద్దలతో సందడిగా మారాయి. చిన్న పిల్లలు కోసం పార్కులో ఏర్పాటు చేసిన ఆట వస్తువులతో ఉల్లాసంగా గడిపారు. పెద్దలు మరువలో దిగి కేరింతలు కొట్టారు. ప్రాజెక్టు వంతెనపై అటూ ఇటూ తిరుగుతూ సెల్ఫీలు దిగారు. తంబళ్లపల్లె నుంచే కాకుండా కడప, అనంతపురం జిల్లాల నుంచి పర్యాటకులు వాహనాల్లో తరలివచ్చారు. సందర్శకులకు ప్రమాదాలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు.



Updated Date - 2021-08-30T05:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising