ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు దినోత్సవం నిర్వహించే హక్కు ప్రభుత్వానికి లేదు

ABN, First Publish Date - 2021-07-08T06:49:21+05:30

రాష్ట్రంలోని రైతులను అడుగ డుగునా అన్యాయం చేస్తున్న సీఎం జగన్‌కు రైతు దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు లేదని తెలుగురైతు నాయకులు ఆర్‌జే వెంకటేష్‌, రాటకొండ మధు బాబు అన్నారు.

ప్రసంగిస్తున్న తెలుగురైతు నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, జూలై 7: రాష్ట్రంలోని రైతులను అడుగ డుగునా అన్యాయం చేస్తున్న సీఎం జగన్‌కు రైతు దినోత్సవం నిర్వహించే నైతిక హక్కు లేదని తెలుగురైతు నాయకులు ఆర్‌జే వెంకటేష్‌, రాటకొండ మధు బాబు అన్నారు. బుధవారం నిమ్మనపల్లె సర్కిల్‌ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో వారు మాట్లా డుతూ... రెండేళ్ల వైసీపీ పాలనతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింద న్నారు. రెండు వేలమందిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ప్రచారం కోసం వేలకోట్లు ఖర్చుపెట్టే వైసీపీ ప్రభుత్వం రైతు ఉత్పత్తులకు మాత్రం మద్దతు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. రుణమాఫీ జీవోను కూడా రద్దు చేసి రైతులను నట్టేట ముంచిన వైసీపీ ప్రభుత్వానికి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత కోల్పోయిందన్నారు. అనంతరం ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిక జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వి.వెంకటేష్‌, మురళి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-08T06:49:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising