ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్యుల కోసం సాంకేతిక విజ్ఞానం

ABN, First Publish Date - 2021-03-05T07:04:14+05:30

దేశంలో సామాన్య మానవుని సంతోషపరిచేలా, వారి అవసరాలు తీర్చగలిగేలా విజ్ఞానం ఉపయోగపడాలని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుపతి ఐఐటీ అధ్యాపకులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఐఐటీ విద్యార్థులతో ముచ్చటిస్తున్న వెంకయ్య నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తిరుపతి ఐఐటీ అధ్యాపకులకు, విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పిలుపు

ఏర్పేడు, మార్చి 4: దేశంలో సామాన్య మానవుని సంతోషపరిచేలా, వారి అవసరాలు తీర్చగలిగేలా విజ్ఞానం ఉపయోగపడాలని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తిరుపతి ఐఐటీ అధ్యాపకులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఏర్పేడు మండలంలోని తిరుపతి ఐఐటీలో జరిగిన కళాశాల 6వ వార్షికోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రమని, ఇక్కడ విద్యా విధానం ఓ జ్ఞానయజ్ఞాన్ని తలపిస్తుందని అభివర్ణించారు.తిరుపతి ఆధునిక విద్యాకేంద్రంగా రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి ఐఐటీకి 2015 మార్చి 28న తాను శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గుర్తు చేసుకున్నారు. కేవలం ఆరేళ్ళలో ఐఐటీ ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో సంతోషంగా వుందన్న ఆయన 6వ వార్షికోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఐఐటీలో ఇంజనీరింగ్‌తో పాటు ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులు, సరికొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. సామాజిక అవసరాల మేరకు దేశానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించే దిశగా యువత కృషి చేయాలని సూచించారు. దానికనుగుణంగానే విద్యా బోధనలు సాగాల్సి వుందన్నారు. అనంతరం ‘వారసత్వ నిర్మాత’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి ఐఐటీ క్యాంపస్‌లో అందుబాటులో వున్న ప్రతిభావంతులైన విద్యార్థులు సాహిల్‌, చైతన్య, నిఖిత, మారైసోజన్‌ తదితరులకు అవార్డులు, రివార్డులు అందజేశారు. అనంతరం విద్యార్థుల వద్దకు వెళ్ళి వారిని పలకరించి మాట్లాడారు.ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ క్యాంపస్‌లో ప్రస్తుతం 1050మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, సుమారు 70 వరకూ ప్రాజెక్టులను విద్యార్థులతో రూపొందించడం జరిగిందని వివరించారు. గతేడాది వివిధ రంగాలకు చెందిన 19 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు అవార్డులకు ఎంపికయ్యారని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళారు. అనంతరం ప్రాంగణంలో ఉపరాష్ట్రపతి మొక్క నాటారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి,  బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్‌, తిరుపతి ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఆర్డీవో కనకనరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T07:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising