ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీసీఎల్‌ ఇంజనీర్‌పై వైసీపీ దాడి

ABN, First Publish Date - 2021-06-14T05:53:34+05:30

ఏర్పేడు మండలంలోని వికృతమాల వద్ద వున్న టీసీఎల్‌ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్‌ ఇంజనీర్‌ జగదీ్‌షరెడ్డిపై వైసీపీ నాయకులు ఆదివారం దాడికి తెగబడ్డారు.

దాడి జరిగిందంటున్న జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేబర్‌ కాంట్రాక్టు కోసం తరచూ వత్తిడి


ఏర్పేడు, జూన్‌ 13: ఏర్పేడు మండలంలోని వికృతమాల వద్ద వున్న టీసీఎల్‌ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్‌ ఇంజనీర్‌ జగదీ్‌షరెడ్డిపై వైసీపీ నాయకులు ఆదివారం దాడికి తెగబడ్డారు. బాధితుడి పిర్యాదు మేరకు విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి పిర్యాదు మేరకు.... టీసీఎల్‌ కంపెనీలో సీనియర్‌ ఇంజనీర్‌గా జగదీష్‌రెడ్డి యేడాదిగా పనిచేస్తున్నాడు. ఆయన కింద సుమారు 50మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ట్రాక్టర్లు కూడ ఆద్దెకు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న తమకు లేబర్‌ కాంట్రాక్టు ఇప్పించడంతో పాటు తమ ట్రాక్టర్లు అద్దెకు తీసుకోవాలని వైసీపీ నాయకులు తరచూ జగదీ్‌షరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వారు జగదీ్‌షరెడ్డి వద్దకు వెళ్లి తమకు లేబర్‌ కాంట్రాక్టు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టులు ఇప్పించే స్థాయి తనది కాదని జగదీ్‌షరెడ్డి చెప్పాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ నాయకుడు గిరితో పాటు మరో ఎనిమిది మంది తనపై దాడి చేసినట్లు జగదీ్‌షరెడ్డి డీఎస్పీ రామచంద్రకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో తనకు దెబ్బలు తగిలినట్లు తెలియపరిచాడు. దీంతో స్పందించిన డీఎస్పీ దాడి చేసిన ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2021-06-14T05:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising