ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కట్టడికి చర్యలు చేపట్టండి: గిరీష

ABN, First Publish Date - 2021-09-29T06:28:34+05:30

‘కొవిడ్‌పై ప్రజలు ఇప్పుడిప్పుడే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాగైతే కరోనా కేసులు పెరిగే అవకాశాలున్నాయి.

అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కమిషనరు గిరీష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి సిటీ, సెప్టెంబరు 28: ‘కొవిడ్‌పై ప్రజలు ఇప్పుడిప్పుడే నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాగైతే కరోనా కేసులు పెరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌ కట్టడికి మెడికల్‌ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలి’ అని కమిషనరు గిరీష సూచించారు. కొవిడ్‌పై కలెక్టర్‌ హరినారాయణన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు మంగళవారం ఆయన తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. కొవిడ్‌ కట్టడికి చేపడుతున్న చర్యలను వివరించారు. అనంతరం ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హరికృష్ణ, ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల డాక్టర్లతో కమిషనరు మాట్లాడారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలో కొవిడ్‌ కేసులు పెరగకుండా చూడాలన్నారు. వ్యాక్సిన్‌ వేసుకోని వారిని గుర్తించి టీకా వేయించాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వుససావేశంలో అదనపు కమిషరు హరిత, డిప్యూటీ కమిషనరు చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి, ఎంఈ చంద్రశేఖర్‌, మేనేజర్‌ హసిమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T06:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising