ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్విమ్స్‌లో క్లిష్టమైన ఆపరేషన్‌ విజయవంతం

ABN, First Publish Date - 2021-11-30T07:36:38+05:30

తాపీ పనిచేస్తున్న కార్మికుడి శరీరంలోకి చొచ్చుకువచ్చిన మూడు అడుగుల ఇనుప చువ్వను తిరుపతిలోని స్విమ్స్‌ వైద్యులు తొలగించారు.

ఇనుప చువ్వను తొలగించిన వైద్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శరీరంలో దిగిన మూడడుగుల ఇనుప చువ్వ తొలగింపు

కృష్ణా జిల్లా వ్యక్తికి ప్రాణంపోసిన వైద్యులు


తిరుపతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తాపీ పనిచేస్తున్న కార్మికుడి శరీరంలోకి చొచ్చుకువచ్చిన మూడు అడుగుల ఇనుప చువ్వను తిరుపతిలోని స్విమ్స్‌ వైద్యులు తొలగించారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన వైద్యులను స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భూమా వెంగమ్మ సోమవారం అభినందించారు. స్విమ్స్‌ వర్గాలు తెలిపిన ప్రకారం.. కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన కె.లక్ష్మయ్య ఈనెల 27న తాపీపని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డారు. ఈ క్రమంలో 10 ఎంఎం ఇనుప చువ్వ అతడి పిరుదుల నుంచి ఎడమ భుజం వైపు దిగబడిపోయింది. చికిత్సకోసం కైకలూరు, విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకుపోయారు. దీనిని క్లిష్టమైన ఆపరేషన్‌గా భావించిన వైద్యులు స్విమ్స్‌కు రెఫర్‌ చేశారు. 28వ తేది స్విమ్స్‌ సర్జికల్‌ గ్యాస్ర్టోఎంట్రాలజీ, సీటీ సర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్యులు సంయుక్తంగా పరిశీలించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి విజయవంతంగా ఇనుప చువ్వను తొలగించారు. లక్ష్యయ్యకు ఎలాంటి ప్రాణాపాయం లేదని స్విమ్స్‌ వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-11-30T07:36:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising