ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు

ABN, First Publish Date - 2021-10-29T07:02:55+05:30

తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి, ఎస్వీ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం గురువారం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యార్థులతో కిక్కిరిసిన ప్రాంగణాలు 


తిరుపతి(విద్య), అక్టోబరు 28: తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి, ఎస్వీ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం గురువారం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించారు. అడ్మిషన్లకు హాజరైన వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సహాయకులతో పద్మావతి కళాశాల కిక్కిరిసింది. ఆ మార్గంలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సకాలంలో పోలీసులు, కళాశాల సిబ్బంది స్పందించి రోడ్డుపై ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను క్రమపద్ధతిలో కళాశాల లోపలకు అనుమతించేలా చర్యలు చేపట్టారు. ఆ కళాశాలలోని వివిధ గ్రూపుల్లో ఇప్పటికే టీటీడీ అధికారులు రెండు దశల్లో ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయించారు. రోస్టర్‌ ప్రకారం కళాశాలలు వాటి అనుబంధ వసతిగృహాల్లో ప్రవేశాలు ఇచ్చారు. మిగిలిన సీట్లకు గురువారం స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టగా అనూహ్యంగా ఎక్కువసంఖ్యలో విద్యార్థులు వచ్చారు. మొదటగా స్థానికతకు ప్రాధాన్యమిచ్చి సీట్లు కేటాయించారు. స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా దాదాపు 95శాతం సీట్లను భర్తీ చేశామని ఆ కాలేజీల ప్రిన్సిపాళ్లు ప్రకా్‌షబాబు, గంగాధర్‌ తెలిపారు. ప్రధాన గ్రూపుల్లో ఆంగ్లమాధ్యమం సీట్లు పూర్తిగా భర్తీ చేశామని, ఇతర గ్రూపులలో ఆంగ్ల, తెలుగు రెండుమాధ్యమాలలో దాదాపుగా అన్ని సీట్లు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఎస్వీజూనియర్‌ కళాశాలలో సాయంత్రం సర్వర్‌సమస్య ఎదురుకావడంతో విద్యార్థులకు మ్యానువల్‌గా పత్రాలు అందించారు. రాత్రి 10 గంటల వరకూ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. వైస్‌ప్రిన్సిపల్‌, కెమిస్ట్రీ అధ్యాపకుడు ప్రియవర్ధన్‌బాబు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-29T07:02:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising