ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైలు

ABN, First Publish Date - 2021-07-28T06:17:22+05:30

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సంస్థ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కిషోర్‌ వెల్లడించారు.

యాత్రా బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న కిషోర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి(ఆటోనగర్‌), జూలై 27: ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సంస్థ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కిషోర్‌ వెల్లడించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ ఐఆర్‌సీటీసీ కార్యాలయంలో మంగళవారం యాత్రాబ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. యాత్రా రైలు ఆగస్టు 27న రాత్రి రేణిగుంటలో బయల్దేరి నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్లగొండ, సికింద్రాబాదు, పెద్దపల్లి, ఖాజీపేట, రామగుండం, నాగపూర్‌ స్టేషన్లలో ఆగి పర్యాటకుల్ని ఎక్కించుకుని ఆగ్రా, మధుర, మాతా వైష్ణోదేవి ఆలయం, అమృత్‌సర్‌, హరిద్వార్‌, ఢిల్లీలో సందర్శించాల్సిన ప్రదేశాలను చూపించి తిరిగి రేణిగుంటకు సెప్టెంబరు ఆరో తేదీన చేరుకుంటుందన్నారు. స్లీపర్‌ క్లాస్‌ ఒక టికెట్‌ ధర రూ.10,400, థర్డ్‌ ఏసీ రూ.17,330 జీఎస్‌టీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు అల్పాహారం, భోజనం లీటర్‌ తాగునీరు తదితర ఉచిత సదుపాయాలు ఉంటాయన్నారు. సంప్రదించాల్సిన నంబర్లు 82879 32313, 82879 32317. తిరుపతి ఏరియా అధికారి ప్రసాద్‌, సుకుమార్‌, మురళి, పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T06:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising