ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా సమస్యలు పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-05-09T06:36:35+05:30

తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీ హెల్త్‌ అడ్మినిస్ట్రేటివ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీ హంస) ప్రతినిధులు మంత్రి ఆళ్ల నానీని కోరారు.

మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న అసోసియేషన్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి నానికి ఏపీ హంస వినతి


తిరుపతి(కొర్లగుంట), మే 8: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీ హెల్త్‌ అడ్మినిస్ట్రేటివ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీ హంస) ప్రతినిధులు మంత్రి ఆళ్ల నానీని కోరారు. శనివారం ఎస్వీయూ సెనేట్‌ హాలులో జరిగిన మీడియా సమావేశం అనంతరం కొందరు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. ‘కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ఎందరో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ వైద్య సౌకర్యార్థం ప్రైవేటు ఆస్పత్రుల్లో 20శాతం వెంటిలేటర్స్‌తో కూడిన బెడ్స్‌ కేటాయించాలి. హెల్త్‌ కార్డు ద్వారా ఉచిత వైద్యమందించాలి. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించండి. వైద్య సేవలందిస్తున్న వారందరికీ ఎన్‌-95 మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్‌ బాటిల్‌ పంపిణీ చేయాలి. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసి, కుటుంబీకులందరికీ టీకా వేయించండి. దీనికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయండి. కరోనా బారిన పడిన ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలి. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులను కరోనా విధుల నుంచి మినహాయించండి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 50-50శాతం విధుల కేటాయింపులు చేపట్టాలి. ఇప్పటికే కొవిడ్‌ విధుల్లో తాత్కాలికంగా కొనసాగుతున్న వారిని మరో ఏడాదిపాటు పొడించండి. కొవిడ్‌తో మృతిచెందితే ఎక్స్‌గ్రేషియో, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి’ అని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-05-09T06:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising