ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతల సమస్యలను పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-06-20T06:26:13+05:30

జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగు రైతు నాయకులు కోరారు. శనివారం వారు కలెక్టర్‌ హరినారాయణన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.

కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగు రైతు విభాగం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌కు తెలుగు రైతు నేతల వినతి


చిత్తూరు సిటీ, జూన్‌ 19: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగు రైతు నాయకులు కోరారు. శనివారం వారు కలెక్టర్‌ హరినారాయణన్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ కరోనా వ్యాప్తి, కర్ఫ్యూ నేపథ్యంలో పంట ఉత్పత్తులను విక్రయించేందుకు రైతులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ధాన్యం బకాయిలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, సున్నావడ్డీ పలువురు రైతులకు ఇంకా అందలేదన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందలేదని, ఈ క్రాప్‌ నమోదులో సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక మామిడి కాయలు మండీల్లో, తోటల్లో మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు మాజీ అధ్యక్షుడు పాచిగుంట మనోహర నాయుడు, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు నాగేశ్వరరాజు, నేతలు చెంగల్రాయ మందడి, చిట్టిబాబు, దేవసుందరం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T06:26:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising