ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-27T07:09:58+05:30

చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద పోలీసులు 5.400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు - స్వాధీనం చేసుకున్న గంజాయి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదుగురు విద్యార్థుల అరెస్టు


చంద్రగిరి, అక్టోబరు 26: చంద్రగిరి మండలం నరసింగాపురం వద్ద పోలీసులు 5.400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు యువకులను అరెస్ట్‌ చేయగా, మరో నలుగురు పరారయ్యారు. ఈ వివరాలను మంగళవారం చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌లో తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప మీడియాకు వివరించారు. ఆ ప్రకారం.. మంగళవారం ఉదయం 5 గంటలకు చంద్రగిరి పోలీసులకు అందిన సమాచారం మేరకు సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు విజయకుమార్‌నాయక్‌, హిమబిందు, సిబ్బంది గిరిబాబు, గోపి, రవికుమార్‌, అమరనాథ్‌తో కలిసి నరసింగాపురం వద్దకు వెళ్లారు. అప్పుడే రైలు దిగి చంద్రగిరి వైపు వస్తున్న 9 మంది యువకులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు వెంబడించగా ఐదుగురు పట్టుబడ్డారు. నలుగురు పారిపోయారు. వీరిని విచారించగా ఎటువంటి సమాధానం రాలేదు. వారి వద్దనున్న కట్టెల బ్యాగును తనిఖీ చేయగా అందులో 5.4 కిలోల గంజాయి ఉంది. వారిని విచారించగా తిరుపతి బైరాగిపట్టెడకు చెందిన తరుణ్‌, తిరుపతికి చెందిన గాలం దిలీ్‌పకుమార్‌, ఎస్‌డీ లేఔవుట్‌కు చెందిన బోడవాళ్ళ గుణసాగర్‌, అబ్బన్నకాలనీకి చెందిన అఖిల్‌రెడ్డి, పేరుగొండ హర్షగా తేలింది. వీరంతా బీటెక్‌, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు. శ్రావణ్‌, రాజేష్‌, రూపేష్‌, హరీష్‌ పరారయ్యారు. వీళ్లంతా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కిలో గంజాయిని రూ.2500 కొని, తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని కళాశాలల విద్యార్థులకు 50 గ్రాములు రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లు డీఎస్పీ నరసప్ప తెలిపారు. భీమవరం సమీపంలోని నర్సాపురం వద్ద గంజాయి కొని నరసింగాపురం వద్ద ట్రైన్‌లో దిగి తిరుపతికి వెళ్లడానికి ఆటో కోసం ఎదురు చూస్తుండగా పట్టుకున్నామన్నారు. పరారైన వారి కోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ఎస్‌ఐ విజయకుమార్‌నాయక్‌, సిబ్బంది గిరిబాబు, గోపి, రవికుమార్‌, అమరనాథ్‌కు ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ నరసప్ప రివార్డులను అందజేసి అభినందించారు. 

Updated Date - 2021-10-27T07:09:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising