కారు సహా 36 ఎర్రచందనం దుంగల స్వాధీనం
ABN, First Publish Date - 2021-10-30T05:01:44+05:30
కారు సహా 36 ఎర్రచందనం దుంగలను శ్రీకాళహస్తి అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
శ్రీకాళహస్తి, అక్టోబరు 29: కారు సహా 36 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. శ్రీకాళహస్తి అటవీ రేంజి అధికారి వెంకటసుబ్బయ్య కథనం మేరకు... పట్టణ శివారులోని చెన్నై రహదారిలో శుక్రవారం అటవీశాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తికి చెందిన మస్తాన్ ఏర్పేడు మండలం ముసలిపేడు నుంచి చెన్నైకి ఓ కారులో 36 ఎర్రచందనం దుంగలను తరలించేయత్నం చేశాడు. చెన్నై రహదారిలో అధికారులు ఉండడం గుర్తించిన మస్తాన్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. దీంతో వాహనాన్ని అధికారులు వెంబడింస్తూనే, బుచ్చినాయుడుకండ్రిగ మండలం విజయగోపాలపురం చెక్‌పోస్టు సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో చెక్‌పోస్టు సిబ్బంది మస్తాన్‌ను అదుపులోకి తీసుకుని, కారు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని శ్రీకాళహస్తి అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.
Updated Date - 2021-10-30T05:01:44+05:30 IST