ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్పంచే.. పారిశుధ్య కార్మికుడై

ABN, First Publish Date - 2021-09-30T06:14:52+05:30

పది రోజులుగా పుదిపట్ల పంచాయతీకి చెత్త ట్రాక్టరును అధికారులు నిలిపేయడంతో సర్పంచ్‌ బడి సుధాయాదవ్‌ చెత్త సేకరించడం ప్రారంభించారు.

చెత్త సేకరిస్తూ నిరసన తెలుపుతున్న బడి సుధాయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఖాకీ నిక్కరు, చొక్కా ధరించి.. విజిల్‌ వేస్తూ రిక్షా తొక్కుకుంటూ వచ్చి.. చెత్త సేకరిస్తున్న ఈయన పారిశుధ్య కార్మికుడు కాదు.. తిరుపతి రూరల్‌ మండలం పుదిపట్ల సర్పంచ్‌ బడి సుధాయాదవ్‌. పది రోజులుగా ఈ పంచాయతీకి చెత్త ట్రాక్టరును అధికారులు నిలిపేశారు. ఈ క్రమంలో తానే చెత్త సేకరిస్తూ బుధవారం నిరసన తెలిపారిలా.ఏ పార్టీ మద్దతు లేకుండా గెలిచిన తనపై అధికారులు పరోక్షంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.పంచాయతీ ఖజానాలో నిధులున్నా, గ్రామానికి అధికారులు నయాపైసా కూడా ఖర్చు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పది రోజులుగా చెత్త ట్రాక్టర్‌, మూడు చక్రాల సైకిళ్లను ఆపేయడంతో చెత్త పేరుకుపోయిందన్నారు. దీని తొలగింపునకు సొంతంగా రూ.4 లక్షలు ఖర్చు చేశానన్నారు. ఆపై వెచ్చించే స్తోమత లేక ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలని నిర్ణయించానన్నారు. తనను గెలిపించిన ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత సర్పంచ్‌గా తనకుందన్నారు.గ్రామ సమస్యలపైనా అధికారులు స్పందించడంలేదని, ఇకనైనా మారకుంటే గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఉప సర్పంచి రేవతి, వార్డు సభ్యులు హేమభూషణ్‌, ఈశ్వరయ్య, సిద్ధయ్య, మునిశంకర్‌, రాజశేఖర్‌, రుక్మిణి, సింగిల్‌విండో మెంబర్‌ మునిరాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

- తిరుపతి రూరల్‌

Updated Date - 2021-09-30T06:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising