ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్రాంతి కొనుగోళ్లు.. సంస్కృతి ఆనవాళ్లు

ABN, First Publish Date - 2021-01-14T04:46:35+05:30

కాల ప్రవాహానికి ఎదురీతుతూ ఇవాళ్టిదాకా ప్రయాణించి వచ్చిన పండుగలెప్పుడూ భారతీయ గ్రామీణ సమష్టి జీవనానికి ప్రతీకలు. పెద్ద పండుగ సంక్రాంతి కొనుగోళ్లు.. మనదైన హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాళ్లు.

కుప్పంలో పూలోయమ్మ పూలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం, జనవరి 13: కరోనా కాటేయొచ్చు.. కష్టాలు ముంచెత్తొచ్చు.. కార్పణ్యాలు బుసకొట్టొచ్చు.. పండుగ సంబరానికి ఇవేమీ అడ్డు కానేకావు. కాల ప్రవాహానికి ఎదురీతుతూ ఇవాళ్టిదాకా ప్రయాణించి వచ్చిన పండుగలెప్పుడూ భారతీయ గ్రామీణ సమష్టి జీవనానికి ప్రతీకలు. పెద్ద పండుగ సంక్రాంతి కొనుగోళ్లు.. మనదైన హైందవ సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాళ్లు.


 భోగి పర్వాన్ని ముగించుకుని పట్టణం తరలొచ్చిన పల్లె.. పండగ కొనుగోళ్లు సరసరా కానిచ్చేసింది. మధ్యాహ్నంనుంచి సాయంత్రం బాగా పొద్దుపోయేదాకా పల్లె జనం పట్టణమంతా తెగ తిరిగేసి కావాల్సిన సంబరాలను పట్టుకుని మళ్లూరెళ్లిపోయారు. గురువారం మకర సంక్రాంతి, ఆపైన శుక్రవారంనాడు కనుమ.అచ్చమైన కష్టజీవుల పండుగలివి. అందుకే.. పల్లెల్లోని శ్రమ జీవులందరూ పట్టణం తరలొచ్చి కొనుగోళ్లు చేశారు. ఇంతకాలం ఇంటి వద్ద పెంచిన నాటు కోళ్లను రెండు చేతుల్లో పట్టుకుని అమ్మేయడానికి తెగ తిరిగేస్తాడొకాయప్ప. ద్విచక్ర వాహనంపైన బంతిపూలు పెట్టుకుని బ్యాలన్స్‌ చేయడానికి కష్టపడిపోతూ వెళ్లిపోతుంటాడు మరొకాయన.ఆ పక్కనే ఇద్దరు ఆడంగులు నిలబడి బంతిచేమంతుల మాలలను తెగ బేరాలాడేస్తారు. అమ్మకాలు తగ్గినా సరే.. ఇళ్ల ముంగిళ్ల ముగ్గుల అలంకారాలకు ఏమాత్రం లోటు చేయబోమంటూ రోడ్డు వార బారులు తీరి తెగ నీలుగుతుంటాయి రంగుల పొడులు. కనుమ  పండక్కు పశువుల కొమ్ములకు వేలాడదీసి ముచ్చట తీర్చుకునే రంగురంగుల కాగితమ్మాలలను ఓ ముత్తైదువ చిరునవ్వుతో తెగ అమ్మకాలు చేసేస్తుంటుంది. గోడకు ఆనించిన చెరకు గడల కొనుగోళ్లు చకచకా సాగిపోతుంటాయి. మూడోనాలుగో అరటి పిలకలను వెనుక క్యారియర్‌పై పెట్టుకుని సైకిల్‌ తోసుకుంటూ బతుకును వెతుక్కుంటూ నడిచిపోతుంటాడో చిన్నోడు. అదిగో అక్కడే ద్విచక్రవాహనంపై ఓ జంట అలా ఝామ్మని రోడ్డంట వెళ్లిపోతూ కాస్త ఆగి అరటి పిలకల కొనుగోలు సాగిస్తుంటుంది. మరీ పండుగల్లోకెల్లా పెద్ద పండుగైన సంక్రాంతి పండుగకు చేసే కొనుగోళ్లు.. మనకే సొంతమైన సంస్కృతీ సంప్రదాయాలకు ఆనవాళ్లై నిలుస్తాయి. మన తాతముత్తాలనాటి పురాస్మతులను మన మనసు వాకిళ్లలో కుప్పవోసి అచ్చెరువు గొలుపుతాయి.

Updated Date - 2021-01-14T04:46:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising