ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడిపల్లె చెరువులో ఇసుక దందా!

ABN, First Publish Date - 2021-08-05T05:37:06+05:30

మదనపల్లె మండ లంలోని మేడిపల్లె చెరువులో ఇసుక తరలిపోతోంది. రాత్రి సమయంలో చెరువులోని ఇసుకను ఎక్స్‌ కవేటర్ల సాయంతో నీటి నుంచి తీసి నిల్వ చేస్తు న్నారు. ఉదయాన్నే తడి ఆరిన ఇసుకను ట్రాక్టర్లతో పట్టణంలో విక్రయిస్తున్నారు.

మేడిపల్లె చెరువులో ఇసుక డంపిగ్‌ నిల్వలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన్‌, ఆగస్టు 4: మదనపల్లె మండ లంలోని మేడిపల్లె చెరువులో ఇసుక తరలిపోతోంది. రాత్రి సమయంలో చెరువులోని ఇసుకను ఎక్స్‌ కవేటర్ల సాయంతో నీటి నుంచి తీసి నిల్వ చేస్తు న్నారు. ఉదయాన్నే  తడి ఆరిన ఇసుకను ట్రాక్టర్లతో పట్టణంలో విక్రయిస్తున్నారు. వాస్తవానికి మదనపల్లె మండలంలో ఇసుక రీచ్‌లు లేవు. ఇక్కడి నిర్మాణా లకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపంజాణి మండలం శంకర్రాయలపేటకు, 60 కిలోమీటర్ల దూ రంలో ఉన్న కలికిరి మండలం గుండ్లూరు రీచ్‌ల నుంచి ఇసుక తెప్పించుకోవాల్సి ఉంది. కానీ మదన పల్లె పట్టణానికి 10 కిలోమీటలర్ల దూరంలో ఉన్న మేడిపల్లె చెరువు, 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీటీఎం చెరువునుంచి ఇసుక తరలిపోతున్నట్టు చెబు తున్నారు. ప్రభుత్వ రీచ్‌ల నుంచి అయితే రూ.3600 చలానా కడితే ఇసుక డోర్‌ డెలివరీ చేస్తారు. అయితే మదనపల్లె చుట్టుపక్కల రీచ్‌లు లేకపోవడంతో చెరువుల నుంచి యథేచ్ఛగా ఇసుక తోడి రూ.6 వేల కు విక్రయిస్తున్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా చెరువులో ఇసుకు తరలిపోతున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఏమి తెలియనట్లు మిన్నకుండి పోతున్నారు. దీంతో ఇసుక దందా జోరుగా సాగు తోంది. చెరువుల్లో ఇలాగే తవ్వకాలు జరిపితే సాగు, తాగునీటికి ఇబ్బందులు పడతామని మేడిపల్లె ఆయ కట్టు రైతులు వాపోతున్నారు. దీనిపై తహసీల్దార్‌ శ్రీని వాసులును వివరణ కోరగా... ఇసుక అక్రమ తవ్వ కాల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. వీఆర్వోను పంపి విచారణ జరిపి అక్రమ రవాణా జరుగు తుంటే ట్రాక్టర్లను సీజ్‌ చేస్తామన్నారు. 



Updated Date - 2021-08-05T05:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising