ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు షురూ!

ABN, First Publish Date - 2021-11-28T06:22:56+05:30

ఆర్టీపీసీఆర్‌ కిట్ల కొరతను తీర్చేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

శ్రీకాళహస్తి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో శ్వాబ్‌ నమూనాల సేకరణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, నవంబరు 27: ఆర్టీపీసీఆర్‌ కిట్ల కొరతతో కొవిడ్‌ పరీక్షలకు బ్రేక్‌ పడడంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయమై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీంతో జిల్లా టీబీ నియంత్రణ అధికారి, ఆర్టీపీసీఆర్‌ కిట్ల సరఫరా ఇన్‌చార్జి రమేష్‌ స్పందించారు. ఆ మేరకు.. జిల్లాలో శ్వాబ్‌ పరీక్షలు ఆగిన పీహెచ్‌సీలు, అర్బన్‌ కేంద్రాల వివరాలపై ఆయన వైద్యాధికారులతో ఆరా తీశారు. అనంతరం అత్యవసర పరిస్థితుల కోసం భద్రపరిచిన(బఫర్‌ స్టాక్‌) నిల్వల నుంచి ఆయా ఆరోగ్యకేంద్రాలకు ఆర్టీపీసీఆర్‌ కిట్ల సరఫరాకు చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు ఉన్నతాధికారుల చొరవతో వారంరోజుల తర్వాత శ్రీకాళహస్తిలోని రెండు అర్బన్‌హెల్త్‌ సెంటర్లలో శ్వాబ్‌ నమూనాల సేకరణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అర్బన్‌ హెల్త్‌ ఇన్‌చార్జి చంద్రమోహన్‌, డాక్టర్‌ గిరిజా ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T06:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising