ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయల చెరువు కట్ట సేఫ్‌.. ‘ఇక భయం లేదు.. ఇళ్లకు రండి!’

ABN, First Publish Date - 2021-11-28T07:28:41+05:30

రామచంద్రాపురం, తిరుపతి రూరల్‌ మండలాల ప్రజలకు ఏడు రోజులపాటు కంటిమీద కునుకులేకుండా చేసిన రాయలచెరువు కట్టకు పడ్డ మూడు గండ్లను శనివారం సాయంత్రానికి అధికారులు పూడ్చివేశారు.

గండిని పూడ్చుతున్న యంత్రాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎట్టకేలకు గండ్లు పూడ్చివేత 

కట్టపై పూజలు చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి, స్థానిక మహిళలు


రామచంద్రాపురం, నవంబరు 27: రామచంద్రాపురం, తిరుపతి రూరల్‌ మండలాల ప్రజలకు ఏడు రోజులపాటు కంటిమీద కునుకులేకుండా చేసిన రాయలచెరువు కట్టకు పడ్డ మూడు గండ్లను శనివారం సాయంత్రానికి అధికారులు పూడ్చివేశారు. దీంతో ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈనెల 21న చెరువుకు గండిపడడంతో కలెక్టర్‌ హరినారాయణన్‌ అన్నిశాఖలను సమన్వయపరచి ఏకబిగిన గండి పూడ్చివేత పనులను పురమాయించారు. ఇంతలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా అసెంబ్లీ సమావేశాల నుంచి నేరుగా రాయల చెరువు కట్టపైకి చేరుకున్నారు. వారం రోజులుగా ఇంటికి పోకుండా దగ్గరుండి కట్టకు పడిన గండ్లను నిపుణులతో పూర్తి చేయించారు. వందలాది మంది కూలీలతోపాటు భారీ యంత్రాలను వినియోగించారు. వీరికి కావాల్సిన అన్ని వసతులను కట్టమీదే సమకూర్చారు. వారంపాటు గ్రామాలు వదిలి వెళ్లిన ప్రజలు శనివారం రాత్రి తిరిగి తమ గ్రామాలకు చేరుకోవడం కనిపించింది. ఎమ్మెల్యేతోపాటు ఎంపీడీవో రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ చినవెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌ అధికారులు, ఆఫ్కాన్‌ ఇన్‌చార్జి రంగస్వామి, ఇంజనీర్లు హరిబాబు, హరికృష్ణను, అధికార యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించినవారిలో.. ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జడ్పీటీసీ భర్త భానుకుమార్‌రెడ్డి, పీవీపురం సర్పంచ్‌ టెండుల్కర్‌లను స్థానికులు అభినందించారు. 


భయంలేదు ఇళ్లకు చేరుకోండి: ఎమ్మెల్యే చెవిరెడ్డి 

‘రాయల చెరువు కట్టకు పడ్డ గండ్లు పూడ్చేశాం. ఇక ఎలాంటి భయం లేదు. అందరూ తమ, తమ ఇళ్లకు చేరుకోండి’ అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కోరారు. శనివారం సాయంత్రం రాయలచెరువుకు చేరుకుని రాయలమ్మకు పూజలుచేసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. చెరువునుంచి 4వేల క్యూసెక్కుల నీరు బయటకు తరలించడంతో నాలుగు అడుగుల నీటిమట్టం తగ్గిందన్నారు. చెరువుకు గండిపడినప్పటి నుంచి రాత్రింబవళ్లు ఇక్కడే ఉండి.. ముంపుగ్రామాల ప్రజలకు నిత్యావసరాలను హెలికాఫ్టర్‌ ద్వారా అందిస్తే.. సోషల్‌ మీడియా అసత్యప్రచారం చేయడాన్ని వారికి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. 



Updated Date - 2021-11-28T07:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising