ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొరవపోతున్న చెరువులు

ABN, First Publish Date - 2021-10-17T06:11:59+05:30

నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు మదనలపల్లె మండలంలోని చీకిలబైలు పంచాయతీ లోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మే డిపల్లె చెరువు నిండి మొరవపోతుంది. పీటీఎం మండలంలోని కందుకూరు, వ్యాసరాయ చెరువు, పీటీఎం పెద్దచెరువులు మొర వలు పోతున్నాయి.

నిండుకుండల్లా మేడిపల్లె చెరువు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె రూరల్‌/ పెద్దతిప్పసముద్రం, అక్టో బరు 16: నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు మదనలపల్లె మండలంలోని చీకిలబైలు పంచాయతీ లోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. మే డిపల్లె చెరువు నిండి మొరవపోతుంది. ఈ మొరవ నీళ్లు దిగువనున్న వెంకటమ్మ చెరువులోకి చే రుతు న్నాయి. దీంతో వెంకటమ్మ చెరువు  నిండుకుండలా తొణికిసలాడుతోంది. అదేవిధంగా కదిరమ్మ చెరువు కూడా జలకళలాడుతోంది. వర్షం కురిస్తే ఈ రెండు చెరువులు మొరవలు పారే అవకాశం ఉంది. గతే డాది కూడా ఈ చెరువులు నిండి మొరవలు సాగ డంతో చుట్టుపక్కల భూములు సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. చెరువులు నిండడంతో చీకిలబైలు, మేడిపల్లె, జోలపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కు జిల్లా సరిహద్దు ప్రాంతాలైన బి.కొత్తకోట, పీటీఎం మండలాల్లో చెరువులు, కుంటలు జలకళ సంతరిం చుకున్నాయి.  పీటీఎం మండలంలోని కందుకూరు, వ్యాసరాయ చెరువు, పీటీఎం పెద్దచెరువులు మొర వలు పోతున్నాయి. అలాగే రంగసముద్రం చెరువు కూడా నిండుకుండను తలపిస్తోంది. పదేళ్ల తరువాత నిండిన ఈ చెరువులను చూడడానికి పీటీఎం, బి.కొత్తకోట, మొలకలచెరువు, కర్ణాటక సరిహద్దు ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. పాపాగ్ని నది ప్రవాహ ఉధృతి కాస్త తగ్గినప్పటికీ రాకపోకలు సాగ లేదు. కందుకూరు వ్యాసరాయ చెరువు రెండు రోజులుగా మొరవ పోతుండటంతో, మిగులు జలాలను  రైతులు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతంలోని చెరువులకు మళ్లిస్తున్నారు. పరదేశి కాలువ(లక్ష్మీదేవి కాలువ) పూడి పోవడంతో ఎక్స్‌కవేటర్‌తో పూడికను తీసి ప్రవాహాన్ని గొడుగువారిపల్లె, నిలువురాతిపల్లె, ఉయ్యాలవారిపల్లె, మద్దిరెడ్డిపల్లె, కాట్నగల్లు, పులికల్లు, చలిమామిడివారిపల్లె, గుండావారిపల్లె చెరువులు, కుంటలకు మళ్లించారు. అనంతరం ఈ మార్గం గుండా మొలకలచెరువు మండలంలోని కదిరినాథునికోటకు వెళ్లనున్నాయి.  





Updated Date - 2021-10-17T06:11:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising