ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంచుకోటపై పగ ఎందుకంటే..

ABN, First Publish Date - 2021-11-14T07:02:44+05:30

కుప్పం మున్సిపల్‌ పరిధిలో 59 శాతం మంది ప్రజలు టీడీపీ వెంట ఉండటమే దీనికి కారణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు,ఆంధ్రజ్యోతి: రాష్ట్రంలోని స్థానిక, మున్సిపల్‌ ఎన్నికలన్నింటినీ నయానో, భయానో దాదాపుగా గెలుచుకున్న వైసీపీ కుప్పం అనే చిన్న, కొత్త మున్సిపాలిటీ కోసం ఎందుకింతగా సకల శక్తులనూ ఒడ్డుతోంది? సర్వ వ్యూహాలనూ పన్నుతోంది? పదే పదే 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నామంటూ ప్రకటించే వైసీపీ నేతల్లో ఆత్మవిశ్వాసం ఎందుకు కొరవడింది? గతంలో జరిగిన ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 8 గ్రామ పంచాయతీల ప్రజలు అత్యధికంగా ఎవరిని ఆదరించారో పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇది టీడీపీ కంచుకోట కావడమే కారణం. వైసీపీ ఫ్యానుగాలి హోరు రాష్ట్రమంతా హోరెత్తినా కుప్పం మున్సిపల్‌ పరిధిలో మాత్రం 59 శాతం మంది ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారు. ఈ ఎనిమిది  పంచాయతీల్లోనూ 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిచోట్లా టీడీపీ అభ్యర్థులే సర్పంచులుగా గెలిచారు. 2009, 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఇదే హవా కొనసాగింది.  2009లో కాంగ్రెస్‌, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు చంద్రబాబుకు దరిదాపుల్లో కూడా లేరు.


ఇదీ టీడీపీ బలం

2009 సాధారణ ఎన్నికల్లో 

మొత్లం పోలైన ఓట్లు : 21,411

టీడీపీకి పడిన ఓట్లు : 14,039 (69%)

కాంగ్రె్‌సకు పోలైనవి : 5617 (22%)

మెజార్టీ : 8422

2014 ఎన్నికల్లో మొత్తం 

పోలైన ఓట్లు : 24,346

టీడీపీకి పడినవి : 16,274 (66%)

వైసీపీకి : 7,224 (30%)

మెజార్టీ : 9050

2019 ఎన్నికల్లో పోలైన 

మొత్తం ఓట్లు : 27,262

టీడీపీకి పడిన ఓట్లు : 17,146 (59%)

వైసీపీకి పడినవి : 8065 (34%)

కాంగ్రెస్‌కు : 1043 (3%)

మెజార్టీ : 9081

Updated Date - 2021-11-14T07:02:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising