ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరుశనగ సాగుకు సమాయత్తం

ABN, First Publish Date - 2021-06-10T05:48:19+05:30

సకాలంలో వర్షాలు కురవడంతో ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు ఆశాజనకంగా ప్రారంభమైంది.

బి.కొత్తకోట సమీపంలో వేరుశనగ విత్తనాలను వేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బి.కొత్తకోట, జూన్‌ 9: సకాలంలో వర్షాలు కురవడంతో ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు ఆశాజనకంగా ప్రారంభమైంది. పొలం దుక్కులు దున్నుకుని వేరుశనగ విత్తనాలు వేయడంలో రైతులు నిమగ్నమయ్యారు. వేరుశనగ విత్తన ధరలు అధికంగా వున్నప్పటికీ వర్షాలు బాగా పడవచ్చనే అంచనాతో రైతులు ధైర్యంగా పెట్టుబడులు పెడుతున్నారు. మదనపల్లె వ్యవసాయ శాఖ డివిజన్‌ పరిధిలో సుమారుగా 35 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ పంట సాగవుతోంది.రెండు సంవత్సరాలుగా వాతావరణ మార్పుల వలన వేరుశనగ పంట రైతులకు మంచి ఫలితాన్నివ్వలేదు.ఈ ఏడాదైనా పంటలు బాగా పండించాలనే ఆశతో రైతులు వేరుశనగ విత్తన కాయలు కొనుగోలు చేసి వాటిని ఒబ్బిడి చేసి పొలాల్లో వేస్తున్నారు.ఎకరం విస్తీర్ణంలో వేరుశనగ సాగుకు రూ.25వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇటీవల ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇచ్చిన రాయితీ విత్తనకాయలు సరిపోవు కాబట్టి మార్కెట్‌లో కొనుగోలు చేసి వేస్తున్నారు.

Updated Date - 2021-06-10T05:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising