ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అభివృద్ధి మండలి’ సమావేశానికి పటిష్ఠ భద్రత కల్పించండి

ABN, First Publish Date - 2021-02-25T07:57:37+05:30

తిరుపతిలో వచ్చేనెల నాల్గవ తేదీ జరగనున్న దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అదనపు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న హరీష్‌కుమార్‌ గుప్తా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అదనపు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 24: తిరుపతిలో వచ్చేనెల నాల్గవ తేదీ జరగనున్న దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అదనపు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా  ఆదేశించారు. ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం బుధవారం తిరుపతికొచ్చిన ఆయన స్థానిక పోలీసు అతిథి భవనంలో ఇంటెలిజెన్స్‌ ఐజీ శశిధర్‌రెడ్డి, అనంతపురం రేంజ్‌ డీఐజీ క్రాంతి రాణాటాటా, అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ గిరీష్‌ తదితర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హరీష్‌కుమార్‌ గుప్తా మాట్లాడుతూ.. సమావేశానికి హోంమంత్రి అమిత్‌షాతోపాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని చెప్పారు. విమానాశ్రయం నుంచి నుంచి సమావేశ వేదిక అయిన తాజ్‌ హోటల్‌ వరకు క్షణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. హోటల్‌ లోపల, వెలుపల సీసీ కెమెరాలను పెట్టి, నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. బందోబస్తు నిర్వహించే అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి తాజ్‌ హోటల్‌ను, పరిసరాలను తనిఖీ చేశారు. 

Updated Date - 2021-02-25T07:57:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising