ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటకానికి ప్రాధాన్యం

ABN, First Publish Date - 2021-10-29T07:19:23+05:30

జిల్లాలో రూ. 1040 కోట్ల పెట్టుబడితో నాలుగు పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గ ఆమోదం లభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ. 1040 కోట్లతో నాలుగు టూరిజం ప్రాజెక్టులు!

హార్సిలీహిల్స్‌, పేరూరుల్లో 7 స్టార్‌ లగ్జరీ రిసార్టులు

మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు

తిరుపతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రూ. 1040 కోట్ల పెట్టుబడితో నాలుగు పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గ ఆమోదం లభించింది.రాష్ట్రవ్యాప్తంగా ఒబెరాయ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఐదు లగ్జరీ రిసార్టులు ఏర్పాటు చేయనుండగా వాటిలో రెండు రిసార్టులు జిల్లాకు రానున్నాయి. హార్సిలీహిల్స్‌తో పాటు తిరుపతి సమీపంలోని పేరూరులో ఇవి ఏర్పాటు కానున్నాయి. సుమారు రూ. 540 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ రిసార్టుల్లో 7 స్టార్‌ సదుపాయాలు అందుబాటులో వుంటాయి.ఈ రిసార్టుల ఏర్పాటుకు ప్రభుత్వ భూమి కేటాయించేందుకు సైతం మంత్రివర్గం అంగీకరించింది. అలాగే తిరుపతిలో రూ. 250 కోట్లతో పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. అదే విధంగా కొత్తకోటలో కూడా రూ. 250కోట్ల అంచనా పెట్టుబడితో పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా 3500 నుంచీ 4 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని అంచనా. మంత్రివర్గ నిర్ణయాలు ఇలా వుండగా ఒబెరాయ్‌ విలా్‌స పేరిట 7 స్టార్‌ లగ్జరీ రిసార్టుల కోసం ఒబెరాయ్‌ సంస్థకు హార్సిలీహిల్స్‌, పేరూరుల్లో ఎంత భూమిని కేటాయిస్తున్నారనే వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు.వీటిని పక్కన పెడితే మిగిలిన రెండు ప్రాజెక్టుల్లో కొత్తకోట అనేది ఏ ప్రాంతమో ప్రకటించలేదు. ఎందుకంటే హార్సిలీహిల్స్‌ సమీపంలో బి.కొత్తకోట పట్టణం వుండగా, చిత్తూరు-తిరుపతి సిక్స్‌లేన్‌ హైవేలో పూతలపట్టు మండల పరిధిలో పి.కొత్తకోట వుంది.ఈ రెండు ప్రాజెక్టులు ప్రైవేటువా లేక నేరుగా ప్రభుత్వమే పర్యాటక సంస్థ ద్వారా చేపడుతుందా అన్నదానిపై స్పష్టత కూడా లేదు.

ఇప్పటికే  పెండింగ్‌లో కీలక ప్రాజెక్టులు

గత ప్రభుత్వ హయాంలో సీఎంగా చంద్రబాబు జిల్లాకు మంజూరు చేసిన కీలక పర్యాటక ప్రాజెక్టులు ఇప్పటికీ పెండింగులో వున్నాయి. తిరుపతి వచ్చే పర్యాటకుల కోసం స్టార్‌ హోటల్‌ మంజూరైనా నిర్మాణం పూర్తి కాలేదు. అలాగే దేవ్‌లోక్‌ పేరిట తిరుమల గిరుల పాదాల చెంత తలపెట్టిన మెగా ప్రాజెక్టు కూడా పెండింగులో పడింది. వీటిని పూర్తి చేయకుండా ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే సొంత జిల్లాలో చంద్రబాబుకు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కొత్తవాటిపై దృష్టి సారిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఆర్థికంగా ప్రభుత్వం బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ ప్రాజెక్టులకు నిధులెక్కడి నుంచీ వస్తాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

నగరి ఏరియా ఆస్పత్రి దారి సమస్య పరిష్కారం

నగరి ఏరియా ఆస్పత్రి దారి సమస్యకు మంత్రివర్గం పరిష్కారం చూపింది.వంద పడకల ఆస్పత్రి నిర్మించినా దారి ఏర్పాటు చేయడానికి ప్రైవేటు భూమి సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే భూమి యజమాని పరిహారం చెల్లించాకే రోడ్డు నిర్మించాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో  పన్నెండేళ్ళుగా ఆస్పత్రికి మట్టిరోడ్డుపైనే రాకపోకలు సాగుతున్నాయి. ఎట్టకేలకు భూమి యజమానికి ప్రత్యామ్నాయంగా మరోచోట ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం అంగీకరించింది.

Updated Date - 2021-10-29T07:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising