గొర్రెల పెంపకదారుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ యాదవ్
ABN, First Publish Date - 2021-10-29T06:47:55+05:30
గొర్రెల పెంపకందారుల సహకార సంఘ జిల్లా అధ్యక్షుడిగా జి.ప్రకాష్ యాదవ్ ఎన్నికయ్యారు.
చిత్తూరు (సెంట్రల్), అక్టోబరు 28: గొర్రెల పెంపకందారుల సహకార సంఘ జిల్లా అధ్యక్షుడిగా జి.ప్రకాష్ యాదవ్ (శ్రీగోకుల ప్రాథమిక గొర్రెల పెంపకదార్ల సహకార సంఘం,ఏర్పేడు) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా కో-ఆపరేటివ్ ఆడిట్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. గురువారం స్థానిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షుడిగా కె.నాగప్ప (శ్రీరామ ప్రాథమిక గొర్రెల పెంపకదార్ల సహకార సంఘం, వెలగపల్లె, వాల్మీకిపురం మండలం) ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు ఉంటుంది. ప్రతి మండలంలోనూ గొర్రెల పెంపకదారుల సహకార సంఘాల ద్వారా మటన్ దుకాణాలు, వెటర్నరీ మెడికల్ దుకాణాలు పెట్టించి గొర్రెల పెంపకందారుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు ప్రకా్‌షయాదవ్ హామీ ఇచ్చారు.
Updated Date - 2021-10-29T06:47:55+05:30 IST